Tuesday, 24 March 2026
  • Home  
  • విశాఖ ఉక్కు లో సమ్మె సైరన్
- విశాఖపట్నం

విశాఖ ఉక్కు లో సమ్మె సైరన్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె నోటీసు స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం, జనవరి 22, (పున్నమి ప్రతినిధి) విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె నోటీసును స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు గురువారం యాజమాన్యానికి అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తారీకు ఉదయం 6 గంటల నుండి 13 వ తారీకు ఉదయం 6 గంటల వరకు సమ్మె నిర్వహిస్తున్నామని వారు అన్నారు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100% వ్యూహాత్మక అమ్మకాన్ని తక్షణమే ఉపసంహరించుకొని సెయిల్ లో దీనిని కలపాలని లేదా సొంత గనులు కేటాయించాలని దీనిని బలోపేతం చేయడానికి ఆప్ స్ట్రీమ్ డౌన్ స్క్రీన్ లను ఆప్టిమైజేషన్ చేయాలని వారి డిమాండ్ చేశారు. దీనిని బలహీనపరిచే విధంగా ఈవోఐ లను ప్రకటించిన ప్రభుత్వ యాజమాన్యాలు దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు అన్నారు. అలాగే కార్మికులకు పూర్తి జీతాన్ని చెల్లించాలని, ప్రొడక్షన్ లింక్ జీతాలను చెల్లించే సర్కులర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, బకాయి పడిన 355% జీతాన్ని చెల్లించాలని, నిలుపుదల చేసిన హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని, ఉక్కు నగరంలో కరెంటు చార్జీలు తగ్గించాలని, ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని. గ్రాట్యుటీ 25 లక్షలు గా చెల్లించాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితులచే ఖాళీలు భర్తీ చేయించాలని, ప్లాంట్లో భద్రత మరియు హాస్పటల్ సౌకర్యాలను మెరుగుపరచాలని తదితర డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నామని వారు వివరించారు. మన జీతాలు హక్కుల కోసం జరుగుతున్న ఈ సమ్మెలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు కె ఎస్ ఎన్ రావు, రమణమూర్తి, జె అయోధ్యరామ్, దాలి నాయుడు, సిహెచ్ సన్యాసిరావు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె నోటీసు

స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం, జనవరి 22, (పున్నమి ప్రతినిధి)

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె నోటీసును స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు గురువారం యాజమాన్యానికి అందజేశారు.
ఈ సందర్భంగా స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తారీకు ఉదయం 6 గంటల నుండి 13 వ తారీకు ఉదయం 6 గంటల వరకు సమ్మె నిర్వహిస్తున్నామని వారు అన్నారు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100% వ్యూహాత్మక అమ్మకాన్ని తక్షణమే ఉపసంహరించుకొని సెయిల్ లో దీనిని కలపాలని లేదా సొంత గనులు కేటాయించాలని దీనిని బలోపేతం చేయడానికి ఆప్ స్ట్రీమ్ డౌన్ స్క్రీన్ లను ఆప్టిమైజేషన్ చేయాలని వారి డిమాండ్ చేశారు. దీనిని బలహీనపరిచే విధంగా ఈవోఐ లను ప్రకటించిన ప్రభుత్వ యాజమాన్యాలు దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు అన్నారు. అలాగే కార్మికులకు పూర్తి జీతాన్ని చెల్లించాలని, ప్రొడక్షన్ లింక్ జీతాలను చెల్లించే సర్కులర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, బకాయి పడిన 355% జీతాన్ని చెల్లించాలని, నిలుపుదల చేసిన హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని, ఉక్కు నగరంలో కరెంటు చార్జీలు తగ్గించాలని, ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని. గ్రాట్యుటీ 25 లక్షలు గా చెల్లించాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితులచే ఖాళీలు భర్తీ చేయించాలని, ప్లాంట్లో భద్రత మరియు హాస్పటల్ సౌకర్యాలను మెరుగుపరచాలని తదితర డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నామని వారు వివరించారు. మన జీతాలు హక్కుల కోసం జరుగుతున్న ఈ సమ్మెలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు కె ఎస్ ఎన్ రావు, రమణమూర్తి, జె అయోధ్యరామ్, దాలి నాయుడు, సిహెచ్ సన్యాసిరావు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.