Saturday, 19 July 2025
  • Home  
  • విశాఖ ఉక్కును కాపాడుకుందాం….
- Featured - ఆంధ్రప్రదేశ్

విశాఖ ఉక్కును కాపాడుకుందాం….

బుచ్చిరెడ్డిపాలెం జనవరి 8 ( పున్నమి విలేఖరి ) విశాఖపట్నం లో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడు పైన ఉన్నదని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం తాసిల్దార్ కార్యాలయం వద్ద ఇరు పార్టీల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1966 నుండి అనేక పోరాటాలు చేసి సాధించుకున్నా ఈ పోరాటంలో అనేక మంది ఉద్యమకారులు తమ ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్నరు. విశాఖ ఉక్కు సాధన కోసం 32 మంది ప్రజలు తన ప్రాణ త్యాగం చేశారు. అనేక రోజులపాటు నాయకులు నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు, రక్తాన్నిచిందీంచడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఇక్కడ కర్మాగారాన్ని స్థాపించేందుకు నిర్ణయించిందన్నారు. దీని నిర్మణానికి అనేక సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నష్టాల్లో ఉందన్న కారణం చూపించి కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి పూనుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి గనుల కేటాయించనందువల్లనే నష్టాలు వస్తున్నాయని వారు తెలిపారు. గనులు కేటాయించకుండా కర్మాగారాన్ని తమ అనుచర గుత్తేదారులకు అమ్మేందుకు ప్రయత్నించదాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో లో సిపిఎం పార్టీ నాయకులు షేక్ జానీ భాష, పోతంశెట్టి శ్రీనివాసులు, పటాన్ బాబు, యువజన సంఘం నాయకులు షేక్ కరీముల్లా, దుర్గా ప్రసాదు, పుగార రాజా, సిఐటియు నాయకులు షేక్ మునీర్ అహ్మద్, మల్లికార్జున కాంగ్రెస్ పార్టీ నాయకులు బిట్టా కిషోర్, పచ్చా మధు, కోవూరు మహేష్, షేక్ సర్దార్, షేక్ షాకీర్, కనిగెల్పుల సునీల్ తదితరులు పాల్గొన్నారు.

బుచ్చిరెడ్డిపాలెం జనవరి 8 ( పున్నమి విలేఖరి )
విశాఖపట్నం లో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడు పైన ఉన్నదని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం తాసిల్దార్ కార్యాలయం వద్ద ఇరు పార్టీల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1966 నుండి అనేక పోరాటాలు చేసి సాధించుకున్నా ఈ పోరాటంలో అనేక మంది ఉద్యమకారులు తమ ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్నరు.
విశాఖ ఉక్కు సాధన కోసం 32 మంది ప్రజలు తన ప్రాణ త్యాగం చేశారు. అనేక రోజులపాటు నాయకులు నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు, రక్తాన్నిచిందీంచడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఇక్కడ కర్మాగారాన్ని స్థాపించేందుకు నిర్ణయించిందన్నారు. దీని నిర్మణానికి అనేక సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నష్టాల్లో ఉందన్న కారణం చూపించి కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి పూనుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి గనుల కేటాయించనందువల్లనే నష్టాలు వస్తున్నాయని వారు తెలిపారు. గనులు కేటాయించకుండా కర్మాగారాన్ని తమ అనుచర గుత్తేదారులకు అమ్మేందుకు ప్రయత్నించదాన్ని ఖండించారు.

ఈ కార్యక్రమంలో లో సిపిఎం పార్టీ నాయకులు షేక్ జానీ భాష, పోతంశెట్టి శ్రీనివాసులు, పటాన్ బాబు, యువజన సంఘం నాయకులు షేక్ కరీముల్లా, దుర్గా ప్రసాదు, పుగార రాజా, సిఐటియు నాయకులు షేక్ మునీర్ అహ్మద్, మల్లికార్జున కాంగ్రెస్ పార్టీ నాయకులు బిట్టా కిషోర్, పచ్చా మధు, కోవూరు మహేష్, షేక్ సర్దార్, షేక్ షాకీర్, కనిగెల్పుల సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.