విశాఖ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
భారత ప్రభుత్వం సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యం గల నూతన ఏఐ హబ్ (Artificial Intelligence Hub) ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గూగుల్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
ఈ ఎంఓయూ సంతకం కార్యక్రమం న్యూఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్లో మంగళవారం ఘనంగా జరిగింది.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్, బికాష్ కొలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), కరణ్ బజ్వా (ప్రెసిడెంట్, ఏషియా పసిఫిక్ గూగుల్ క్లౌడ్) తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో ప్రతిష్టాత్మకంగా ఏర్పడనున్న ఈ ఏఐ హబ్ ద్వారా టెక్నాలజీ, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలలో కొత్త అవకాశాలు, ఉపాధి వృద్ధి కలుగనున్నట్లు అధికారులు తెలిపారు.


