విశాఖలో వైసీపీ భారీ ర్యాలీ
ర్యాలీకి తరలివచ్చిన 41వ వార్డు కార్యకర్తలు, నాయకులు
మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమానికి ప్రజా మద్దతు
తక్షణమే కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసు కోవాలని డిమాండ్
41వ వార్డు కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్
విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యం లో భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంత కాల కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీలో భారీగా 41వ వార్డు కార్పొరేటర్ పూర్ణిమ,వార్డు అధ్యక్షులు శ్రీధర్ ఆద్వర్యంలో భారీగా కార్యకర్త లు,నాయకులు తరలివచ్చారు. జీవిఎంసీ నుంచి మద్దిలపాలేం తెలుగుతల్లి విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది.ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేకరించిన కోటి సంతకాల ప్రతుల బాక్సులను పార్టీ సెంట్రల్ కార్యా లయానికి తరలించారు.ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్ధులు నష్టపోయే ప్రమాదం ఉందని,తమ ప్రభుత్వ హయాంలో సాదించిన అభివృద్దిని కూటమి ప్రభుత్వ క్రెడిట్ లో వేసు కుంటున్నారని ఎద్దెవ చేశారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


