Monday, 8 December 2025
  • Home  
  • విశాఖలో మొంథా తుఫాన్‌ బీభత్సం.
- విశాఖపట్నం

విశాఖలో మొంథా తుఫాన్‌ బీభత్సం.

విశాఖలో మొంథా తుఫాన్‌ బీభత్సం. రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి వద్ద భారీగా వరద గురుద్వార దీపక్ పంజాబీ డాబా వద్ద నేలకొరిగిన చెట్టు ఫిషింగ్ హార్బర్ వద్ద ఎగిసిపడుతున్న రాకాసి అలలు *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్‌లో టెన్షన్‌ పెడుతోన్న మొంథా తుఫాన్‌ తీవ్రరూపం దాల్చింది.. విశాఖలో మొంథా తీవ్ర తుఫాన్‌ బీభత్సం కొనసాగుతోంది.. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. జ్ఞానాపురం రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డు నీటమునిగింది. ఆరిలోవ రామకృష్ణాపురం ప్రాంతంలో గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పేర్కొన్నారు అదే విధంగా ఫిషింగ్ హార్బర్ వద్ద రాకాసి అలలు అలజడి సృష్టిస్తున్నాయి.. 10 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి రాకాసీ అలలు.. విశాఖ పోర్టుకు ఏడో నెంబర్ ప్రమాదక హెచ్చరికలు జారీచేశారు వాతావరణ శాఖ అధికారులు.. ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు.. మొంథా తుఫాన్ ను తీవ్రంగా పరిగణిస్తున్నారు మత్స్యకారులు.. లంగర్ వేసిన బోట్లు, పడవలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.. తాళ్లతో కట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మత్స్యకారులు.. తుఫాన్‌ తీరం తాకే సమయంలో గంటకు 100-110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. బోట్లు కొట్టుకు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. జెట్టీల లోని సురక్షత ప్రాంతాలకూ బోట్లు తరలింపునకు పడరాని పాట్లు మత్స్యకారులు పడుతున్నారు.ఇక, కాకినాడకు గ్రేట్ డేంజర్‌ సిగ్నల్ జారీ చేశారు అధికారులు.. కాకినాడ పోర్టులో 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్‌ సిగ్నల్ 9 జారీ చేశారు.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుకు 8వ నంబర్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి.. మరోవైపు, విశాఖపట్నంలో కుండపోత వర్షం కురుస్తుండడంతో.. విశాఖలో అన్ని విమానాలు రద్దు చేశారు అధికారులు.. 36 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించారు.. ఇంకోవైపు.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు.. తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు చేశారు.. కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు కాగా.. ఈస్ట్‌ కోస్ట్‌ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్‌ రైళ్లు రద్దు అయ్యాయి.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు.. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు.. నేడు, రేపు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

విశాఖలో మొంథా తుఫాన్‌ బీభత్సం.

రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి వద్ద భారీగా వరద

గురుద్వార దీపక్ పంజాబీ డాబా వద్ద నేలకొరిగిన చెట్టు

ఫిషింగ్ హార్బర్ వద్ద ఎగిసిపడుతున్న రాకాసి అలలు

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
ఆంధ్రప్రదేశ్‌లో టెన్షన్‌ పెడుతోన్న మొంథా తుఫాన్‌ తీవ్రరూపం దాల్చింది.. విశాఖలో మొంథా తీవ్ర తుఫాన్‌ బీభత్సం కొనసాగుతోంది.. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. జ్ఞానాపురం రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డు నీటమునిగింది. ఆరిలోవ రామకృష్ణాపురం ప్రాంతంలో గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పేర్కొన్నారు అదే విధంగా ఫిషింగ్ హార్బర్ వద్ద రాకాసి అలలు అలజడి సృష్టిస్తున్నాయి.. 10 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి రాకాసీ అలలు.. విశాఖ పోర్టుకు ఏడో నెంబర్ ప్రమాదక హెచ్చరికలు జారీచేశారు వాతావరణ శాఖ అధికారులు.. ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు.. మొంథా తుఫాన్ ను తీవ్రంగా పరిగణిస్తున్నారు మత్స్యకారులు.. లంగర్ వేసిన బోట్లు, పడవలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.. తాళ్లతో కట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మత్స్యకారులు.. తుఫాన్‌ తీరం తాకే సమయంలో గంటకు 100-110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. బోట్లు కొట్టుకు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. జెట్టీల లోని సురక్షత ప్రాంతాలకూ బోట్లు తరలింపునకు పడరాని పాట్లు మత్స్యకారులు పడుతున్నారు.ఇక, కాకినాడకు గ్రేట్ డేంజర్‌ సిగ్నల్ జారీ చేశారు అధికారులు.. కాకినాడ పోర్టులో 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్‌ సిగ్నల్ 9 జారీ చేశారు.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుకు 8వ నంబర్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి.. మరోవైపు, విశాఖపట్నంలో కుండపోత వర్షం కురుస్తుండడంతో.. విశాఖలో అన్ని విమానాలు రద్దు చేశారు అధికారులు.. 36 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించారు.. ఇంకోవైపు.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు.. తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు చేశారు.. కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు కాగా.. ఈస్ట్‌ కోస్ట్‌ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్‌ రైళ్లు రద్దు అయ్యాయి.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు.. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు.. నేడు, రేపు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.