*విశాఖలో ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన*
*విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి * విశాఖ భీమిలి మండలం కాపులుప్పాడలో ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ (Fluentgrid Limited) ఐటీ సంస్థ క్యాంపస్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సీఈవో, ఎండీ జి.మురళీ కృష్ణ, ప్రెసిడెంట్ జి.రత్న, డైరెక్టర్ జి.విప్రేష్ ఆనంద్, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


