విశాఖలో 15వ లక్కీ షాపింగ్ మాల్ ఘన ప్రారంభం
సినీ నటి–యాంకర్ అనసూయ సందడి… ప్రజాప్రతినిధుల హాజరుతో పండగ వాతావరణం
ఉత్తరాంధ్ర ప్రతినిధి డిసెంబర్ 14 యువతరం న్యూస్
విశాఖపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ 15వ శాఖ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ హాజరై అభిమానులను ఉత్సాహపరిచారు.
ఈ ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, గణబాబు, గండి బాబ్జి, పరుశురామరాజు, కందుల నాగరాజు తదితర ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొని మాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు వినియోగదారులను విశేషంగా ఆకర్షించాయి. అనసూయను ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తి, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందాలనే ఆశతో భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో షాపింగ్ మాల్ జనసంద్రాన్ని తలపించి పండగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన అనసూయ భరద్వాజ, లక్కీ షాపింగ్ మాల్ సాధించిన ప్రగతిని అభినందిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
లక్కీ షాపింగ్ మాల్ 15వ శాఖ ప్రారంభం విశాఖ నగరంలో షాపింగ్ ప్రియులకు మరో ఆకర్షణగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.


