Tuesday, 24 March 2026
  • Home  
  • విశాఖలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన*
- విశాఖపట్నం

విశాఖలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన*

*విశాఖలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన* *విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి* విశాఖ కాపులుప్పాడలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపస్ భవన నిర్మాణానికి (Quarks Technosoft Pvt Ltd) విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.115 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. *హైదరాబాద్ లో చేసిన మ్యాజిక్ ను సీఎం చంద్రబాబు గారు విశాఖలో రిపీట్ చేస్తున్నారు* ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మీరు చూస్తున్నది అంతా చరిత్ర. గతంలో హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు గారు కృషి చేశారు. అలాంటి మ్యాజిక్కే మళ్లీ చంద్రబాబు గారు ఏపీలోని విశాఖలో చేస్తున్నారు. లోకల్ అంత్రపెన్యూర్స్ ను మేం ప్రోత్సహిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో మేం ముందుకు వెళ్తున్నాం. విశాఖలో గాజువాక, భీమిలి ఎమ్మెల్యేలకు అత్యధిక మెజార్టీని ప్రజలకు కట్టబెట్టారు. నాకు మూడో అత్యధిక మెజార్టీ వచ్చింది. ప్రజలు మాపై ఎంతో విశ్వాసం ఉంచారు. వారు నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ఎండీలను నేను మొదటిసారి కలుస్తున్నా. శంకుస్థాపన కార్యక్రమంలోనే నేను కలుస్తానని చెప్పా. అదీ పెట్టుబడుల పట్ల మా కమిట్ మెంట్. *గత 18 నెలల్లో మేం 190 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాం* గత 18 నెలల్లో మేం 190 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాం. మాకు ఏదైనా వదిలిపెడతారా అని ఇతర రాష్ట్రాల వారు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ప్రతి పెట్టుబడికి మేం పోటీ ఇస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే.. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ప్రధాని మోడీ గారు, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన నాయకులు. 75 ఏళ్ల వయసులోనూ పరిగెడుతున్నారు. వీరి నాయకత్వం భారతదేశం, ఏపీకి ఎంతో అదృష్టం. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. ఏపీ, విశాఖ, తెలుగు ప్రజలను గర్వపడేలా చేస్తాం. యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. కష్టపడి పనిచేయాలి. విజయానికి దగ్గరి దారులు లేవు. చంద్రబాబు గారు 19 గంటల వరకు కష్టపడతారు. విశాఖ గౌరవాన్ని పెంచే విధంగా మీరు పనిచేయాలి. ముందుండి నడిపించాలి. తర్వాతి తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. నేను విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తా. విశాఖ మ్యాజికల్ సిటీ. మీరు రౌడీలను తరిమికొడతారు. రౌడీల చుట్టూ రౌడీలే ఉంటారు. దేశానికి నడిపించాలి అనుకునే వారి చుట్టూ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారే ఉంటారు. అందరం కలిసి విశాఖకు గర్వకారణంగా నిలుద్దాం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్లు, విశాఖను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలంటే నైతిక విలువలు కూడా ముఖ్యమే అని గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో విపిన్ వింద్యాల్, డైరెక్టర్ అశుతోష్ కౌశిక్, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

*విశాఖలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన*

*విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి* విశాఖ కాపులుప్పాడలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపస్ భవన నిర్మాణానికి (Quarks Technosoft Pvt Ltd) విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.115 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

*హైదరాబాద్ లో చేసిన మ్యాజిక్ ను సీఎం చంద్రబాబు గారు విశాఖలో రిపీట్ చేస్తున్నారు*

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మీరు చూస్తున్నది అంతా చరిత్ర. గతంలో హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు గారు కృషి చేశారు. అలాంటి మ్యాజిక్కే మళ్లీ చంద్రబాబు గారు ఏపీలోని విశాఖలో చేస్తున్నారు. లోకల్ అంత్రపెన్యూర్స్ ను మేం ప్రోత్సహిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో మేం ముందుకు వెళ్తున్నాం. విశాఖలో గాజువాక, భీమిలి ఎమ్మెల్యేలకు అత్యధిక మెజార్టీని ప్రజలకు కట్టబెట్టారు. నాకు మూడో అత్యధిక మెజార్టీ వచ్చింది. ప్రజలు మాపై ఎంతో విశ్వాసం ఉంచారు. వారు నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ఎండీలను నేను మొదటిసారి కలుస్తున్నా. శంకుస్థాపన కార్యక్రమంలోనే నేను కలుస్తానని చెప్పా. అదీ పెట్టుబడుల పట్ల మా కమిట్ మెంట్.

*గత 18 నెలల్లో మేం 190 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాం*

గత 18 నెలల్లో మేం 190 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాం. మాకు ఏదైనా వదిలిపెడతారా అని ఇతర రాష్ట్రాల వారు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ప్రతి పెట్టుబడికి మేం పోటీ ఇస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే.. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ప్రధాని మోడీ గారు, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన నాయకులు. 75 ఏళ్ల వయసులోనూ పరిగెడుతున్నారు. వీరి నాయకత్వం భారతదేశం, ఏపీకి ఎంతో అదృష్టం. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. ఏపీ, విశాఖ, తెలుగు ప్రజలను గర్వపడేలా చేస్తాం. యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. కష్టపడి పనిచేయాలి. విజయానికి దగ్గరి దారులు లేవు. చంద్రబాబు గారు 19 గంటల వరకు కష్టపడతారు. విశాఖ గౌరవాన్ని పెంచే విధంగా మీరు పనిచేయాలి. ముందుండి నడిపించాలి. తర్వాతి తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. నేను విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తా. విశాఖ మ్యాజికల్ సిటీ. మీరు రౌడీలను తరిమికొడతారు. రౌడీల చుట్టూ రౌడీలే ఉంటారు. దేశానికి నడిపించాలి అనుకునే వారి చుట్టూ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారే ఉంటారు. అందరం కలిసి విశాఖకు గర్వకారణంగా నిలుద్దాం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్లు, విశాఖను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలంటే నైతిక విలువలు కూడా ముఖ్యమే అని గుర్తించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో విపిన్ వింద్యాల్, డైరెక్టర్ అశుతోష్ కౌశిక్, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.