Tuesday, 24 March 2026
  • Home  
  • విశాఖలో కోడి పందాలపై పోలీసుల మెరుపు దాడులు – 10 మంది అరెస్ట్
- విశాఖపట్నం

విశాఖలో కోడి పందాలపై పోలీసుల మెరుపు దాడులు – 10 మంది అరెస్ట్

విశాఖ, జనవరి – (పున్నమి ప్రతినిధి) విశాఖ నగరంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఒక వైపు షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షాపులు జనంతో కిటకిటలాడుతుండగా, మరో వైపు గుట్టుగా జూదం, కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. నగర పరిధిలోని కంచెరపాలెం డీఎల్బీ గ్రౌండ్స్ వద్ద కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 మంది జూదరాయుళ్లను అరెస్టు చేసి, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. పండుగలను అడ్డుగా పెట్టుకుని అక్రమ జూదాలు, కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి కార్యకలాపాలను సహించేది లేదని స్పష్టం చేశారు.

విశాఖ, జనవరి – (పున్నమి ప్రతినిధి)

విశాఖ నగరంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఒక వైపు షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షాపులు జనంతో కిటకిటలాడుతుండగా, మరో వైపు గుట్టుగా జూదం, కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. నగర పరిధిలోని కంచెరపాలెం డీఎల్బీ గ్రౌండ్స్ వద్ద కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 మంది జూదరాయుళ్లను అరెస్టు చేసి, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. పండుగలను అడ్డుగా పెట్టుకుని అక్రమ జూదాలు, కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి కార్యకలాపాలను సహించేది లేదని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.