Sunday, 22 March 2026
  • Home  
  • విశాఖపట్నంలో 88.35 కి.మీ. నగర రహదారుల అభివృద్ధికి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ఆమోదం.
- విశాఖపట్నం

విశాఖపట్నంలో 88.35 కి.మీ. నగర రహదారుల అభివృద్ధికి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ఆమోదం.

విశాఖపట్నంలో 88.35 కి.మీ. నగర రహదారుల అభివృద్ధికి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ఆమోదం. * యాన్యుటి మోడల్ రోడ్ల అభివృద్ధికి రెండవ జోన్ లో కార్యాచరణను ప్రారంభించిన జీవీఎంసీ కమిషనర్ *విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి* యాన్యుటి మోడల్ రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధి (MA&UD) శాఖ ఉత్తరవులను జారీ చేసిందని, ఆ దిశగా కార్యాచరణను వెంటనే ప్రారంభించడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం ఆయన ఆన్యూటీ మోడల్ రోడ్ల అభివృద్ధి కార్యాచరణలో భాగంగా రెండవ జోన్ పరిధిలో కార్ షెడ్ నుండి పీఎం పాలెం రోడ్డును జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ పి వి సత్యనారాయణ రాజు చీఫ్ సిటీ ప్లానర్ ఏ ప్రభాకర్ రావు, జోనర్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, ఇతర ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విశాఖపట్నంలో 88.35 కి.మీ. నగర రహదారుల అభివృద్ధికి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆమోద ఉత్తర్వులను బుధవారం జారీ చేశారన్నారు . ఈ ప్రాజెక్టు PPP – హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద, మొత్తం ₹306.95 కోట్ల వ్యయంతో, పూర్తిగా GVMC అంతర్గత ఆదాయ వనరుల ద్వారా అమలు చేయబడనుందని, ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ గ్రాంట్ అవసరం ఉండదనికమిషనర్ తెలిపారు. 88.35 కి.మీ. రహదారుల అభివృద్ధి పనులను PPP-HAM మోడల్‌లో అమలు ప్రాజెక్ట్‌కు APUIAML ను ట్రాన్సాక్షన్ అడ్వైజర్ & స్వతంత్ర ఇంజనీర్ కన్సల్టెంట్ గా నియమించడానికి అనుమతించిందని,ప్రాజెక్ట్ చెల్లింపుల కోసం ఆస్తిపన్ను ఆదాయాన్ని ప్రత్యేక ఎస్క్రో ఖాతాకు మళ్లించడం. RFP & కన్సెషన్ అగ్రిమెంట్ (CA) డ్రాఫ్ట్ బిడ్ పత్రాలకు అనుమతి కలదని, బిడ్‌ను విడుదల చేసి, ఫలితాలను GVMC కౌన్సిల్/ప్రభుత్వ ఆమోదం కోసం సమర్పించడానికి అనుమతి కలిగిందని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ సూచనలు మేరకు ప్రాజెక్టు సాధ్యత అధ్యయనం, నాణ్యత పరిరక్షణ, రిస్క్ షేరింగ్, ప్రాజెక్టు మానిటరింగ్ వంటి అన్ని అంశాలను కచ్చితంగా అనుసరించి, నగర రహదారి మౌలిక వసతులను ఆధునిక ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా జీవీఎంసీ వేగంగా చర్యలు ప్రారంభిస్తుందన్నారు. విశాఖపట్నం ప్రజలకు ఉన్నత ప్రమాణాల రహదారి సదుపాయాలు అందించడానికి జీవీఎంసీ కట్టుబడి ఉందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ రోడ్ల అభివృద్ధి కార్యాచరణలో భాగంగా జీవీఎంసీ రెండవ జోన్ పరిధిలో యాన్యుటి మోడల్ రోడ్డు అభివృద్ధికి కార్ షెడ్ జంక్షన్ నుండి పీఎం పాలెం రోడ్డును పరిశీలించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. పీఎం పాలెం ఆఖరి బస్ స్టాప్ వరకు, బాబా కాలేజ్ వరకు, సాయి ప్రియ లేఅవుట్ వరకు మూడు దశలలో 4.6 కిలోమీటర్ల ప్రస్తుతం ఉన్న రోడ్డును అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ రోడ్డు అభివృద్ధిలో రోడ్డు విస్తరణ, సెంటర్ మీడియన్, గ్రీనరీ, రోడ్డు మార్కింగ్ పెయింటింగ్, రోడ్ స్టడ్లు, సైనేజులు, కాలువలు, కాలువల పై కవరింగ్ స్లాబులు, ఫుట్పాతులు, ఎఫ్ ఆర్ పి గ్రేటింగు, కేబుల్ లో కొరకు డక్టులు, స్ట్రీట్ లైటింగ్, బస్టాప్లు, కూర్చునే బెంచీలు, డస్ట్ బిన్లు, హోర్డింగులు తదితర అన్ని సదుపాయాలతో, ప్రజలు వాహనాల రాకపోకలకు వీలుగా అందమైన మొక్కలతో సుందరీ కరణతో రోడ్డు అభివృద్ధికి, నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రధాన ఇంజనీర్ కు చీఫ్ సిటీ ప్లానర్ కు, ఏపీ యు ఐ ఎం ఎల్ ప్రతినిధులకు అవసరమగు కార్యాచరణ వెంటనే చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఈ రోడ్డు విస్తరణ అభివృద్ధి కార్యక్రమం లో అవసరమగు కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు కు కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీరు శాంతిరాజ్, డిసిపి హరిదాస్, ఏసిపి శాస్త్రి, ఏపీ యుఐఎంఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నంలో 88.35 కి.మీ. నగర రహదారుల అభివృద్ధికి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ఆమోదం.
* యాన్యుటి మోడల్ రోడ్ల అభివృద్ధికి రెండవ జోన్ లో కార్యాచరణను ప్రారంభించిన జీవీఎంసీ కమిషనర్

*విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి* యాన్యుటి మోడల్ రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధి (MA&UD) శాఖ ఉత్తరవులను జారీ చేసిందని, ఆ దిశగా కార్యాచరణను వెంటనే ప్రారంభించడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం ఆయన ఆన్యూటీ మోడల్ రోడ్ల అభివృద్ధి కార్యాచరణలో భాగంగా రెండవ జోన్ పరిధిలో కార్ షెడ్ నుండి పీఎం పాలెం రోడ్డును జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ పి వి సత్యనారాయణ రాజు చీఫ్ సిటీ ప్లానర్ ఏ ప్రభాకర్ రావు, జోనర్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, ఇతర ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విశాఖపట్నంలో 88.35 కి.మీ. నగర రహదారుల అభివృద్ధికి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆమోద ఉత్తర్వులను బుధవారం జారీ చేశారన్నారు . ఈ ప్రాజెక్టు PPP – హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద, మొత్తం ₹306.95 కోట్ల వ్యయంతో, పూర్తిగా GVMC అంతర్గత ఆదాయ వనరుల ద్వారా అమలు చేయబడనుందని, ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ గ్రాంట్ అవసరం ఉండదనికమిషనర్ తెలిపారు.
88.35 కి.మీ. రహదారుల అభివృద్ధి పనులను PPP-HAM మోడల్‌లో అమలు ప్రాజెక్ట్‌కు APUIAML ను ట్రాన్సాక్షన్ అడ్వైజర్ & స్వతంత్ర ఇంజనీర్ కన్సల్టెంట్ గా నియమించడానికి అనుమతించిందని,ప్రాజెక్ట్ చెల్లింపుల కోసం ఆస్తిపన్ను ఆదాయాన్ని ప్రత్యేక ఎస్క్రో ఖాతాకు మళ్లించడం. RFP & కన్సెషన్ అగ్రిమెంట్ (CA) డ్రాఫ్ట్ బిడ్ పత్రాలకు అనుమతి కలదని, బిడ్‌ను విడుదల చేసి, ఫలితాలను GVMC కౌన్సిల్/ప్రభుత్వ ఆమోదం కోసం సమర్పించడానికి అనుమతి కలిగిందని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ సూచనలు మేరకు ప్రాజెక్టు సాధ్యత అధ్యయనం, నాణ్యత పరిరక్షణ, రిస్క్ షేరింగ్, ప్రాజెక్టు మానిటరింగ్ వంటి అన్ని అంశాలను కచ్చితంగా అనుసరించి, నగర రహదారి మౌలిక వసతులను ఆధునిక ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా జీవీఎంసీ వేగంగా చర్యలు ప్రారంభిస్తుందన్నారు. విశాఖపట్నం ప్రజలకు ఉన్నత ప్రమాణాల రహదారి సదుపాయాలు అందించడానికి జీవీఎంసీ కట్టుబడి ఉందని కమిషనర్ పేర్కొన్నారు.
ఈ రోడ్ల అభివృద్ధి కార్యాచరణలో భాగంగా జీవీఎంసీ రెండవ జోన్ పరిధిలో యాన్యుటి మోడల్ రోడ్డు అభివృద్ధికి కార్ షెడ్ జంక్షన్ నుండి పీఎం పాలెం రోడ్డును పరిశీలించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. పీఎం పాలెం ఆఖరి బస్ స్టాప్ వరకు, బాబా కాలేజ్ వరకు, సాయి ప్రియ లేఅవుట్ వరకు మూడు దశలలో 4.6 కిలోమీటర్ల ప్రస్తుతం ఉన్న రోడ్డును అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ రోడ్డు అభివృద్ధిలో రోడ్డు విస్తరణ, సెంటర్ మీడియన్, గ్రీనరీ, రోడ్డు మార్కింగ్ పెయింటింగ్, రోడ్ స్టడ్లు, సైనేజులు, కాలువలు, కాలువల పై కవరింగ్ స్లాబులు, ఫుట్పాతులు, ఎఫ్ ఆర్ పి గ్రేటింగు, కేబుల్ లో కొరకు డక్టులు, స్ట్రీట్ లైటింగ్, బస్టాప్లు, కూర్చునే బెంచీలు, డస్ట్ బిన్లు, హోర్డింగులు తదితర అన్ని సదుపాయాలతో, ప్రజలు వాహనాల రాకపోకలకు వీలుగా అందమైన మొక్కలతో సుందరీ కరణతో రోడ్డు అభివృద్ధికి, నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రధాన ఇంజనీర్ కు చీఫ్ సిటీ ప్లానర్ కు, ఏపీ యు ఐ ఎం ఎల్ ప్రతినిధులకు అవసరమగు కార్యాచరణ వెంటనే చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఈ రోడ్డు విస్తరణ అభివృద్ధి కార్యక్రమం లో అవసరమగు కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు కు కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీరు శాంతిరాజ్, డిసిపి హరిదాస్, ఏసిపి శాస్త్రి, ఏపీ యుఐఎంఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.