విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో చూపుతున్న ఆసక్తికి ధన్యవాదాలు తెలుపుతున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ చోడే వెంకట పట్టాభిరామ్ తెలిపారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి నగరానికి విచ్చేసిన ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ను పట్టాభిరామ్ విమానాశ్రయంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ
> “దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేయడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఉత్తరాంధ్రలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇక్కడి యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి,” అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


