Monday, 30 March 2026
  • Home  
  • వివిధ సెట్ లు (Icet, Edcet, Law cet etc) లకి సంభందించిన ప్రవేశల్లో ఎలాంటి బేషరత్తు గా ప్రవేశాలు కలిపించాలి. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్
- హైదరాబాద్

వివిధ సెట్ లు (Icet, Edcet, Law cet etc) లకి సంభందించిన ప్రవేశల్లో ఎలాంటి బేషరత్తు గా ప్రవేశాలు కలిపించాలి. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్

పున్నమి ప్రతినిధి 👉ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి వినతి పత్రం అందచేత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి నేడు వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ “రాష్ట్ర వ్యాప్తంగా వివిధ CET’s (ICET, EdCET, LAWCET etc) కి సంబంధించిన ప్రవేశాలు జరుగుతున్న ఈ తరుణంలో చాలా కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలు కూడా విద్యార్థులకు ఫీ రియింబర్స్మెంట్ బకాయిలను సాకుగా చూపి సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఇవ్వాలంటే మొత్తం ఫీజు విద్యార్థులే కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయని అన్నారు.విద్యార్థులు వారు పూర్వం చదివిన కళాశాలల నుండి custodian సర్టిఫికెట్ తీసుకొచ్చినప్పటికి కూడా అడ్మిషన్ పొందిన ప్రస్తుత కళాశాలలు వాటిని అంగీకరించట్లేదనీ,ఈ కారణాల వల్ల అడ్మిషన్ వచ్చిన విద్యార్థులు మనోవేదనకు గురి అవుతున్నారన్నారు.కష్టపడి చదివి ర్యాంక్ సాధించిన ఇలాంటి కారణాల వల్ల అడ్మిషన్ పొందలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారనీ,ఈ పరిస్థితి దాపురించడానికి కారణం ప్రభుత్వం సకాలంలో ఫీ రియింబర్స్మెంట్ చెల్లించకపోవడమే అని అన్నారు.ప్రభుత్వ తప్పులకు విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని,కావున ఛైర్మన్ గారు ఎలాంటి షరతులు లేకుండా అడ్మిషన్స్ చేసుకోవాలని కళాశాలలను,యూనివర్సిటీలను ఆదేశించాలని,ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గసభ్యులు జీవన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజు, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు దృహన్,విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరి ప్రసాద్ పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి

👉ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి వినతి పత్రం అందచేత

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి నేడు వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ “రాష్ట్ర వ్యాప్తంగా వివిధ CET’s (ICET, EdCET, LAWCET etc) కి సంబంధించిన ప్రవేశాలు జరుగుతున్న ఈ తరుణంలో చాలా కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలు కూడా విద్యార్థులకు ఫీ రియింబర్స్మెంట్ బకాయిలను సాకుగా చూపి సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఇవ్వాలంటే మొత్తం ఫీజు విద్యార్థులే కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయని అన్నారు.విద్యార్థులు వారు పూర్వం చదివిన కళాశాలల నుండి custodian సర్టిఫికెట్ తీసుకొచ్చినప్పటికి కూడా అడ్మిషన్ పొందిన ప్రస్తుత కళాశాలలు వాటిని అంగీకరించట్లేదనీ,ఈ కారణాల వల్ల అడ్మిషన్ వచ్చిన విద్యార్థులు మనోవేదనకు గురి అవుతున్నారన్నారు.కష్టపడి చదివి ర్యాంక్ సాధించిన ఇలాంటి కారణాల వల్ల అడ్మిషన్ పొందలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారనీ,ఈ పరిస్థితి దాపురించడానికి కారణం ప్రభుత్వం సకాలంలో ఫీ రియింబర్స్మెంట్ చెల్లించకపోవడమే అని అన్నారు.ప్రభుత్వ తప్పులకు విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని,కావున ఛైర్మన్ గారు ఎలాంటి షరతులు లేకుండా అడ్మిషన్స్ చేసుకోవాలని కళాశాలలను,యూనివర్సిటీలను ఆదేశించాలని,ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గసభ్యులు జీవన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజు, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు దృహన్,విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరి ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.