కామారెడ్డి, 16 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని ఈ మండల నాయకులు, జిల్లా మాజీ ఫ్లోర్ లీడర్ తమ కష్టార్జితాన్ని సమర్పించి, అవసరమైన శవ యాత్ర వాహనంను సమకూర్చేందుకు ముందుకు వచ్చి బహుమతిగా రామారెడ్డి గ్రామానికి గతంలో తన తండ్రి పేరు మీద శవ వాహనాన్ని ఆందజేశా రు. ఆ వాహనం అంతిమయాత్రలకు వాహనాన్ని వినియోగించారు.కానీ ఇప్పుడు ఆ వాహనం చెడిపోయి, వినూత్న అభివృద్ధి పేరుతో “ప్రత్యేక పాలన”చేయాల్సిన బాధ్యత ఉన్న అధికారులూ, చేతులు దులిపేసుకుంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.దాతల నిస్సహాయతకు నిదర్శనం గ్రామ ప్రజ లు వాహనాన్ని ఎప్పటికప్పుడు మర మ్మత్తులు చేయాలని ఎన్నో మార్లు వినతులు ఇస్తు న్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల మరమ్మతులు జరగడం లేదు.స్వచ్ఛందంగా నిధులు ఇచ్చిన దాతలకు, వారు చేసిన దాతృత్వానికి లాభం కల గడం లేదు. భవిష్యత్‌పై అనిశ్చితి“మనం ఇచ్చిన డబ్బులు ఎవరి చేతికి వెళ్లాయి?”, “రిపేర్‌కి ఎవరూ పట్టించు కోలేరు?”, “ప్రత్యేక అధికారులెక్కడ?” అనే ప్రశ్నలు గ్రామ ప్రజలను కలవరపెడుతున్నా యి. ఒకవైపు గ్రామంలో పెరుగుతున్న పచ్చదనాని కి ఉదాహర ణగా నర్సరీలు నిలుస్తుంటే, మరొకవై పు సమాజానికి అవసరమైన అంత్యక్రియ వాహన వ్యవస్థలో విచ్చిన్నత అధికమవు తోంది.పాలనలో లోపాలపై మండిపాటు, ప్రజాప్రతినిధులు, అధికా రులు ఆధికారాన్ని పరిగణించకుండా ముద్ర వేసేం దుకు మాత్రమే స్పందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇది ప్రత్యేక అభివృద్ధి పాలన పేరుతో జరిగిన నిర్లక్ష్య పాలనా విషయానికి నిదర్శనం. ప్రజల డిమాండ్స్ కాలంలో శవయాత్ర వాహనం మరమ్మత్తులు పూర్తిచేయాలని, ఇంటర్న ల్ ఆడిట్ చేసి, నిధుల వినియోగంపై గ్రామ సదస్సులో వివరాలు ప్రకటించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.


