పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 : ఓ జర్నలిస్ట్ సంఘం నాయకులు విరహత్ అలీ జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణలు చెప్పాలని టిడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి రాందాస్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ యుడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర అధ్యక్షులు విరహత్ ఆలీ జర్నలిస్టులను ఉద్దేశించి విష సర్పాలు, కుట్రలు, బుడ్డ సంఘాలు, బుడార్ ఖాన్లు, కాళ్లలోకి దూరడం వంటి అభ్యంతరకర వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. గతంలో కూడా సంఘాలను, జర్నలిస్టులను కించపరిచేలా విరహత్ అలీ ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. విరహత్ అలీ వ్యాఖ్యలను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రంగా రెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ఆయన వైఖరిని జర్నలిస్టు సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నా ఇప్పటివరకు విరహత్ అలీ కానీ ఆ సంఘం పెద్దలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. విరహత్ అలీ తన వ్యాఖ్యలపై జర్నలిస్టులకు భేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విరహత్ అలీ జర్నలిస్టు సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి …, టిడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు..డి రాందాస్