உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
ஸ்ரீ பொட்டி ஸ்ரீராமுலு நெல்லூர்

వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్ఐ

புன்னமி செய்தியறை வெளியீடு:
వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్ఐ

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్ఠించే వారు తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి తీసుకోవాలని ఎస్ఐ గంగుల.సుభాషిణి సూచించారు.
  • ఉత్సవ కమిటీలు ఉచిత సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
  • రహదారులు, ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా మండపాలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని, లౌడ్స్పికర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని తెలిపారు.

వినాయక చవితి
సందర్భంగా మండపాలు ఏర్పాటు
చేసి విగ్రహాలు ప్రతిష్ఠించే వారు
తప్పనిసరిగా ముందస్తు పోలీసు
అనుమతి తీసుకోవాలని ఎస్ఐ గంగుల.సుభాషిణి సూచించారు. ఉత్సవ కమిటీలు ఉచిత సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రహదారులు, ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా మండపాలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని, లౌడ్స్పికర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని తెలిపారు. డీజేలు, మందుగుండు సామగ్రి వినియోగం నిషేధమని, నిమజ్జనంలో మద్యం సేవించి పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాల వద్ద రాత్రివేళ కమిటీ సభ్యులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *