*
తడ,ఆగస్టు(పున్నమి ప్రతినిధి):
వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ఏర్పాటుకు ప్రభుత్వం సిం గిల్ విండో విధానం అమలులోకి తెచ్చింది.పోలీసులు అనుమతులు పొందిన తరువాత మాత్రమే విగ్రహాలు ఏర్పాటుచేయాలని తడ SI కొండప్ప నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. అయన మాట్లాడుతూ వినాయక మండపాలు ఏర్పాటు కోసం పోలీస్ స్టేషన్లో వివరాలు, ఏప్రాతంలో ఏర్పాటుచేస్తున్నారు అనే చిరునామా, సంబంధించిన వివరాలు అందజేయాలి.నిమజ్జనం ఎక్కడ చేస్తారు,ఎప్పుడు తీసుకెళతారు అనేది కూడా దరఖాస్తులో పూర్తిచేయాలి. వినాయక విగ్రహాలు రహదారులపై ఏర్పాటు చేయరాదని,వాహనాల రాకపోగాలకు అంతరాయం కలిగించరాదన్నారు.అదేవిధంగా వినాయక చవితిలో డీజే లకు టపాకాయలకు అనుమతి లేదన్నారు.పండగ సందర్భంగా ఇతర మతస్థులను కించపరచడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండపాల వద్ద ఆసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తప్పదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.


