ఉదయగిరి సెప్టెంబర్ 5 : పున్నమి న్యూస్ ప్రతినిధి /నాగరాజు :///
ఉదయగిరి మండలం అప్పసముద్రం పంచాయతీ నందు గత శుక్రవారం వినాయక చవితి నిమర్జనం లొ చోటు చేసుకొన్న బాణా సంచ పేలుడు ప్రమాదం లో గాయపడిన చిన్నారులను, ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి లో ,నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటున్న చిన్నారులను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకట్ రెడ్డి గారు. చిన్నారులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ,వారికి అవసరమైన మెరుగయిన వైద్యం అందించడానికి అన్ని విధాలుగా తోడుంటానని తెలపటం జరిగింది. ప్రస్తుత వైద్య ఖర్చులకు ప్రతి పిల్లవాళ్లకి 15000 చొప్పున 5మంది పిల్లల కీ కలిపి 75000వారి కుటుంబ సభ్యులకు అందచేయటం జరిగింది.అదేవిధంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి సహకారం తొ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని , తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా తోడుంటుంది అని తెలియపరచటం జరిగింది. ముందు ముందు ఇటువంటి వి జరగకుండా తగిన చర్యలు తీసుకొంటామని ఆయన పేర్కొనటం జరిగింది.



1 Comment
RRAMAKRISHNAIAH
September 5, 2025గుడి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి.
వింజమూరు పున్నమి పత్రిక ప్రతినిధి
వింజమూరు మండల పరిధిలోని భట్టువారిపాలెం వెళ్లే మార్గంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరుగుతుండగా, వింజమూరు కి చెందిన రవి అనే వ్యక్తి అడ్డుకుంటూ, అధికారులు చేత బెదిరించడం చేస్తున్నాడని వారు వాపోయారు. దాతల సహకారంతో గుడి నిర్మాణం చేపట్టి, గుడి నిర్మాణానికి సహాయ సహకారం అందించిన గంగిరెడ్డిపాలెం వాసులు పై అక్రమ కేసులు పెట్టడం, మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. 48 సెంట్లు భూమిలో కొంత గుడి నిర్మాణం చేయగా, మిగతా స్థలాన్ని పూజారి ఉండేదుకు, వంట సామాగ్రిని నిల్వ చేసేకి రూములు ఏర్పాటుకు కట్టడాల కడుతుంటే,రెవిన్యూ అధికారులను పంపి నిర్మాణాలను పడగొట్టండి అని చెప్పడం ఎంతవరకు సబబు అని వారు మండిపడ్డారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు వేడుకుంటున్నాము.