పున్నమి ప్రతినిధి
హైదరాబాద్
పేదలకు మెరుగైన విద్య అందించేందుకు, రాష్ట్రంలో విద్యా రంగానికి ప్రాధాన్యతనిచ్చేలా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లోని పాఠశాలలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి పాఠశాలలో ప్లే గ్రౌండ్, తరగతి గదులు, మంచి వాతావరణం ఉండేలా మెరుగుపరచాలని, స్థల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ భూమిని వినియోగించుకోవాలని సూచించారు.
అదేవిధంగా, నర్సరీ నుండి 4వ తరగతి వరకు కొత్త స్కూల్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఆదేశించారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. 2026 అకడమిక్ సంవత్సరం నుండి ఈ పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు.


