Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rangareddy

* విద్యార్థుల్లో శ్రవణ భాషణ సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.. — ఏఎక్సెల్ ఫర్ ఎఫ్ ఎల్ ఎన్ ఏఐ బేసెడ్ లెర్నింగ్ క్లాస్ను ప్రారంభి..ఎం ఈ ఓ-బాసు నాయక్ *

Punnami Newsroom Published:
* విద్యార్థుల్లో శ్రవణ భాషణ సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.. — ఏఎక్సెల్ ఫర్ ఎఫ్ ఎల్ ఎన్ ఏఐ బేసెడ్ లెర్నింగ్ క్లాస్ను ప్రారంభి..ఎం ఈ ఓ-బాసు నాయక్ *

Story highlights

  • పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్‌పేట్ మరియు బాలాపూర్ డివిజన్‌లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో 2024–2025 విద్యాసంవత్సరానికి గాను పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రధమ స్థానం సాధించిన…
  • ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం అత్యంత అవసరమని విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి సేవలు అభినందనీయమైనవి అని....ఈ విధమైన కార్యక్రమాలు విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని…
  • అలాగే, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్‌పేట్ మరియు బాలాపూర్ డివిజన్‌లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో 2024–2025 విద్యాసంవత్సరానికి గాను పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రధమ స్థానం సాధించిన విద్యార్థులకు జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ సహకారంతో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం బిజెపి అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం బిజెపి కార్యాలయంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం అత్యంత అవసరమని విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి సేవలు అభినందనీయమైనవి అని….ఈ విధమైన కార్యక్రమాలు విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి అని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రావుల మల్లేష్ బిజెపి సీనియర్ నాయకులు నవారు శ్రీనివాస్ రెడ్డి, రేసు నరసింహారెడ్డి, కొంతం సంపత్ రెడ్డి, బిజెపి ఉపాధ్యక్షులు సైదులు, కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, బిజెపి నాయకులు మల్లేష్, ఆంజనేయులు యాదవ్, బీజేవైఎం నాయకులు సతీష్ నందా, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *