*సైన్స్ ఫెయిర్ తో శాస్త్రీయ దృక్పథం విద్యార్థుల్లో పెంపొందించవచ్చు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని గారి పిలుపు*
*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 01/12 /2025/*
*వికసితి భారత్ శాస్త్రీయ దృక్పథం డిజిటల్ విద్య పర్యావరణహితం ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడం ఆలోచన పరిశీలన శక్తిని విద్యార్థుల్లో పెంపొందించడం లాంటి ప్రధాన అంశాలతో మూడు రోజులుగా ఎం జె పి చిట్యాల లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ఘనంగా ముగింపు చేయడం జరిగిందని ఇందులో ప్రథమ ద్వితీయ ఎగ్జిబిట్స్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులు వచ్చేనెల రాష్ట్రస్థాయిలో జరిగే సైన్స్ ఫెయిర్ లో పాల్గొంటారని జిల్లా కి మంచి పేరు తీసుకొస్తారని ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని జిల్లాలోని అన్ని పాఠశాలలో సైన్సు పరికరాలను డిజిటల్ విద్యతో మమేకం చేస్తూ వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందే విధంగా బోధన అభ్యసన జరగాలని ఉపాధ్యాయులను ఉద్దేశించి డీఈఓ గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శ్రీనివాసులు ఏఎమ్ఓ మహానంది ప్రతాప్ రెడ్డి ఉపాధ్యాయ సంఘం నాయకులు మీడియా కన్వీనర్లు ఎం ఎన్ ఎిజయకుమార్ గిరిరాజా చారి తదితరులు పాల్గొన్న


