అమడగూరు: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపునకు నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ పరీక్షలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు డి.నరసారెడ్డి పేర్కొన్నారు.శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ పరీక్షలను నాలుగు స్థాయిలలో విద్యార్థులకు నిర్వహించి మండల స్థాయికి విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు.అనంతరం నవంబర్ 1న మండల స్థాయి,నవంబర్ 23న జిల్లాస్థాయి,డిసెంబర్ 12న రాష్ట్రస్థాయి లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమణరెడ్డి,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపునకు జన విజ్ఞాన వేదిక చెకుముకి పరీక్ష.