Story highlights
- నర్సంపేటలోని ఎస్ ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మంగళవారం సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
- ముఖ్య అతిథులుగా హాజరైన సీఐ ఎం.
- శ్రీనివాస్, ఎస్ఐ నిహారిక విద్యార్థులకు తగు సూచనలు చేశారు.
నర్సంపేటలోని ఎస్ ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మంగళవారం సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన సీఐ ఎం. శ్రీనివాస్, ఎస్ఐ నిహారిక విద్యార్థులకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు చదువుపై దృష్టి సారించి మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. అపరిచిత లింకులు ఓపెన్ చేయడం, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవడం వంటివి చేయరాదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు పెట్టొద్దని తెలిపారు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా అత్యవసరంగా 112 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. తద్వారా మోసపోయిన డబ్బును తిరిగి రాబట్టే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కొయ్యడి సనత్ కుమార్, శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News Sources
- WhatsupPress release