వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్ద కోర్పుల్ గ్రామానికి చెందిన పేద విద్యార్థిని ఎంబిబిఎస్ చదువుకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక భరోసా కల్పించారు. మండలంలోని. పెద్ద కోర్పుల్ .గ్రామానికి చెందిన బాదావత్ పవిత్ర .ఇటీవలే ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక ట్యూషన్ ఫీజు .హాస్టల్ ఖర్చులను భరించడం కష్టంగా మారింది. దీంతో మాజీ ఎంపీపీ అజయ్ కుమార్. ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోమవారం విద్యార్థిని పవిత్రను శ్రీనివాస్ రెడ్డి వద్దకు తీసుకెళ్లగా ఐదేళ్లకు అవసరమైన ట్యూషన్ హాస్టల్ ఫీజులు అందిస్తానని భరోసా కల్పించారు. సాయం అందించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి పవిత్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
