స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలకు చిట్వేల్ పరిషత్ ఉన్నత పాఠశాల వేదిక కానుంది. ఈనెల 18, 19 తేదీల్లో జరిగే ఈ పోటీలను మండల విద్యాశాఖ అధికారులు కోదండనాయుడు, ఈశ్వరయ్య మరియు ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు ప్రకటించారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలురు, బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, యోగ, అథ్లెటిక్స్, చెస్ తదితర ఏడు క్రీడల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. 18న గేమ్స్, 19న అథ్లెటిక్స్ పోటీలు జరుగనున్నాయి. కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, హైస్కూల్ ప్లస్‌లోని ఇంటర్ విద్యార్థులు నేరుగా జిల్లా స్థాయి ఎస్‌జిఎఫ్ గేమ్స్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అర్హత గల క్రీడాకారుల జాబితా, మధ్యాహ్న భోజన అటెండెన్స్ ఫార్మ్‌లు వెంట తీసుకురావాలని పీడీలు, పిఇటీలకు సూచించారు. మరిన్ని వివరాలకు ప్రధానోపాధ్యాయులు 9966173441లో సంప్రదించవచ్చని తెలిపారు.

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి – ప్రధానోపాధ్యాయులు