విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఎంఈఓ-1 శిలారపు హేబేలు సూచించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఎంఈఓలు హేబేలు, ఆనంద్ కుమార్ పోటీలను ప్రారంభించారు. వాలీబాల్ బాయ్స్ అండర్ -17 విభాగంలో ఈదర జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రథమ స్థానం, ఆగిరిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ద్వితీయ స్థానం సాధించింది. బాలికల విభాగంలో అగిరిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల చెందిన విద్యార్థునులు గెలుపొందారు. అండర్ -14 కబడ్డీ బాలురు విభాగంలో ఆగిరిపల్లి పాఠశాలకు చెందిన విద్యార్థులు విజయం సాధించారు. బాలిక కబడ్డీ పోటీల్లో ఈదుల గూడెం కి చెందిన విద్యార్థులు గెలుపొందారు. విద్యార్థులను ఎంఈఓ లు హేబేలు, ఆనంద్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, పిఈటిలు శివ నాగేందర్ రావు, సుగుణ రావు, ఉమామహేశ్వరి, హర్ష పాల్గొన్నారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఎంఈఓ-1 శిలారపు హేబేలు సూచించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఎంఈఓలు హేబేలు, ఆనంద్ కుమార్ పోటీలను ప్రారంభించారు. వాలీబాల్ బాయ్స్ అండర్ -17 విభాగంలో ఈదర జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రథమ స్థానం, ఆగిరిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ద్వితీయ స్థానం సాధించింది. బాలికల విభాగంలో అగిరిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల చెందిన విద్యార్థునులు గెలుపొందారు. అండర్ -14 కబడ్డీ బాలురు విభాగంలో ఆగిరిపల్లి పాఠశాలకు చెందిన విద్యార్థులు విజయం సాధించారు. బాలిక కబడ్డీ పోటీల్లో ఈదుల గూడెం కి చెందిన విద్యార్థులు గెలుపొందారు. విద్యార్థులను ఎంఈఓ లు హేబేలు, ఆనంద్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, పిఈటిలు శివ నాగేందర్ రావు, సుగుణ రావు, ఉమామహేశ్వరి, హర్ష పాల్గొన్నారు.

