కల్వకుర్తి : సాధారణంగా జోక్ వేస్తే ఎవ్వరైనా నవ్వుతారు. నవ్వడమే ఆ విద్యార్థులు చేసిన పాపం.. 30 మంది విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాదాడు ఉపాధ్యాయుడు. ఈ ఘటన కల్వకుర్తి పట్టణంలోని మినిస్టేడియంలో ఉన్న మహాత్మగాంధీ జ్యోతి బాపూలే గురుకుల విద్యాలయం(బాలుర) పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కల్వకుర్తి పట్టణంలోని మినీ స్టేడియంలో మహాత్మ జ్యోతి బాపులే గురుకుల విద్యాలయంలో ఈనెల 11న 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో బయాలజీ పరీక్ష నిర్వహించారు. ఇన్విజిలేటర్ గా గెస్ట్ టీచర్ అయిన వెంకటేశ్వర్లు ను పంపారు. అదే సందర్భంలో ఈ ఇన్విజిలేటర్ పిల్లలపై జోక్ వేయగా ఆ తరగతి విద్యార్థులు పడి పడి నవ్వారు. అదే క్రమంలో విద్యార్థులు గుసగుస లాడుతూ పగలపడి నవ్వడంతో ఆవేశంతో రెచ్చిపోయిన గెస్ట్ టీచర్ 30 మందికి పైగా విద్యార్థులను బెత్తంతో, చేతితో విపరీతంగా, క్రూరంగా వీపులపై, కాళ్ళపై వాతలు వచ్చేలా కొట్టాడు.ఈ విషయమై విద్యార్థులు వారి క్లాస్ టీచర్ తో వెళ్లి ప్రిన్సిపల్ ఉష రాణికి కంప్లైట్ చేశారు. మరుసటి రోజు విచారణ చేసిన ప్రిన్సిపల్ దీనిపై స్పందించి ఆర్సివో కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. గెస్ట్ టీచర్ ను విధుల నుంచి తోలగించింది. ఈ విషయమై గురువారం విద్యార్థి సంఘాలు, పలు సంఘాల నాయకులు వెళ్లి పాఠశాల వద్ద నానా రభస చేశారు. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మా పిల్లలను క్రురంగా బాదిన టీచర్ పై విధుల నుంచి తొలగించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రిన్సిపల్ ను కోరారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఆ టీచర్ కు చర్యలు తప్పనిసరిగా ఉంటాయని ఆమె తెలిపారు.

విద్యార్థులపై టీచర్ పైశాచికం.. ఏకంగా 30 మందిపై..!