*విద్యార్థులతో సమీక్ష సమావేశం!*
▪️ఎంఈఓ శోభనాద్రి.
*మన పొదలకూరు:*
మండలంలోని తాటిపర్తి వైకెకె హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులతో మండల విద్యాశాఖధికారి-2 ఎం శోభనాద్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సిలబస్ కు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడారు. విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్ నాగమోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


