విద్యార్థులకు మానసిక ఒత్తిడిలో నవ్వకుండా ఉండేందుకు చింతలపూడి పోలీసులు అవగాహన కార్యక్రమం
పున్నమి ప్రతినిధి జూన్ 25

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గర్ల్స్ జూనియర్ కాలేజీ చింతలపూడిలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో సిఐ క్రాంతికుమార్ ఎస్సైసతీష్ కుమార్ పాల్గొని విద్యార్థులకు పలు ముఖ్య అంశాలపై విలువైన సూచనలు అవగాహన కలిగించారు ముఖ్యంగా విద్యా భారం కుటుంబవంతుడులు పంట సమస్యలతో మానసిక ఒత్తిడి కి లోనవ్వకుండా ఉండటానికి విద్యార్థులు తీసుకువలసిన జాగ్రత్తలపై మార్గదర్శనం యువతతో పెరుగుతున్న సైబర్ నేరాలు సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు వ్యక్తిగత సమాచారం రక్షణ ఆన్లైన్ మోసాలపై హెచ్చరికలు బాలల రక్షణ కోసం ఉన్న పిఓసిఎస్ఓ చట్టం గురించి వివరణ దాని కింద వచ్చే నేరాలు బాధితులు తీసుకోవలసిన చర్యలపై అవగాహన ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థుల సందేహాలను తొలగిస్తూ వారు మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు అందుబాటులో ఉన్న సహాయక వనరులు హెల్ప్ లైన్ నెంబర్లను తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు నైతిక శైర్యం చట్టాల పట్ల అవగాహన పెంపొందించడంతోపాటు వారు భవిష్యత్తులో బాధ్యతారహితంగా తీరు అనుసరించేందుకు దోహదపడుతుందని అన్నారు