విద్యార్థి మరియు ప్రజా సంఘాల హక్కులను హరించే ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి
RC.No – 30/67/2025 Dated (01-08-2025) ఆదేశాలను ప్రభుత్వం రద్దు చేయాలి విద్యార్థుల సమస్యలు బయటకి రాకుండా ఉండేందుకే పాఠశాలల్లోకి ప్రజా సంఘాల ప్రవేశాన్ని నారా లోకేష్ నిషేధించడం యస్సీ యస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి పాఠశాల ఆవరణలోకి విద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాల ప్రవేశాన్ని నిషేదిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేసుకోవాలని యస్సీ యస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను బయటకు రాకుండా చేయాలన్నా కుట్రతోనే ప్రభుత్వం ఇలాంటి నియంతృత్వ పోకడలతో ఆదేశాలు జారీ చేసిందని ఆమె అన్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ సమస్యలపై గట్టిగా పోరాడండి అంటూ అందరిని ప్రోత్సహించి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతృత్వ ధోరణితో హక్కులను కాలరాస్తూ జారీ చేసిన ఆదేశాలను చూస్తే కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగా పాలనను సాగిస్తుంది అని ఆమె తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే జీ.వో లు తీసుకువస్తే విద్యార్థి ప్రజా సంఘాలు స్వాగతిస్తారు కానీ ఇలాంటి పనికిరాని జీ.వోలను,ఆదేశాలనుహర్షించరు పి ఆమె అన్నారు. విద్యార్థి మరియు ప్రజా సంఘాల హక్కులను హరించే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనికూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా ఐక్యవేదిక రాయలసీమ డివిజన్ అధ్యక్షురాలు ఈడిగ భారతమ్మ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ ,జిల్లా ఉపాధ్యక్షురాలు హుస్సేన్ బి ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షురాలు ఎలిశమ్మ ఎమ్మిగనూరు మండల అధ్యక్షురాలు ఈరమ్మ,గోనెగండ్ల మండల అధ్యక్షురాలు ఖాసింబి పాల్గొన్నారు

విద్యార్థి మరియు ప్రజా సంఘాల హక్కులను హరించే ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి
విద్యార్థి మరియు ప్రజా సంఘాల హక్కులను హరించే ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి RC.No – 30/67/2025 Dated (01-08-2025) ఆదేశాలను ప్రభుత్వం రద్దు చేయాలి విద్యార్థుల సమస్యలు బయటకి రాకుండా ఉండేందుకే పాఠశాలల్లోకి ప్రజా సంఘాల ప్రవేశాన్ని నారా లోకేష్ నిషేధించడం యస్సీ యస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి పాఠశాల ఆవరణలోకి విద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాల ప్రవేశాన్ని నిషేదిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేసుకోవాలని యస్సీ యస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను బయటకు రాకుండా చేయాలన్నా కుట్రతోనే ప్రభుత్వం ఇలాంటి నియంతృత్వ పోకడలతో ఆదేశాలు జారీ చేసిందని ఆమె అన్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ సమస్యలపై గట్టిగా పోరాడండి అంటూ అందరిని ప్రోత్సహించి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతృత్వ ధోరణితో హక్కులను కాలరాస్తూ జారీ చేసిన ఆదేశాలను చూస్తే కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగా పాలనను సాగిస్తుంది అని ఆమె తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే జీ.వో లు తీసుకువస్తే విద్యార్థి ప్రజా సంఘాలు స్వాగతిస్తారు కానీ ఇలాంటి పనికిరాని జీ.వోలను,ఆదేశాలనుహర్షించరు పి ఆమె అన్నారు. విద్యార్థి మరియు ప్రజా సంఘాల హక్కులను హరించే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనికూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా ఐక్యవేదిక రాయలసీమ డివిజన్ అధ్యక్షురాలు ఈడిగ భారతమ్మ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ ,జిల్లా ఉపాధ్యక్షురాలు హుస్సేన్ బి ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షురాలు ఎలిశమ్మ ఎమ్మిగనూరు మండల అధ్యక్షురాలు ఈరమ్మ,గోనెగండ్ల మండల అధ్యక్షురాలు ఖాసింబి పాల్గొన్నారు

