(పున్నమి ప్రతినిధి, నెల్లూరు )
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నవాబుపేట ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు సూచించారు. గురువారం నగరంలోని బీవీఎస్ గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినులకు మహిళా రక్షణ చట్టాలపై శ్రీరామరాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యకమ్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని చట్టాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. మహిళలు ఆపద సమయంలో ఈ చట్టాల ద్వారా రక్షణ పొందవచ్చన్నారు. ప్రతి ఒక్క మహిళ తమ సెల్‌ఫోన్‌లో ఈ చట్టాలకు సంబంధించిన యాప్‌ల అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యార్థినులకు బ్యాడ్ టచ్, గుడ్‌టచ్, ఈవ్‌టీజింగ్, దిశ యాప్ తదితరాలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. అనంతరం దిశ యాప్ గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
(పున్నమి ప్రతినిధి, నెల్లూరు ) ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నవాబుపేట ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు సూచించారు. గురువారం నగరంలోని బీవీఎస్ గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినులకు మహిళా రక్షణ చట్టాలపై శ్రీరామరాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యకమ్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని చట్టాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. మహిళలు ఆపద సమయంలో ఈ చట్టాల ద్వారా రక్షణ పొందవచ్చన్నారు. ప్రతి ఒక్క మహిళ తమ సెల్‌ఫోన్‌లో ఈ చట్టాలకు సంబంధించిన యాప్‌ల అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యార్థినులకు బ్యాడ్ టచ్, గుడ్‌టచ్, ఈవ్‌టీజింగ్, దిశ యాప్ తదితరాలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. అనంతరం దిశ యాప్ గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు.