నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి)
చదివే ధ్యేయంగా బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలని, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితేనే,బలమైన భవిష్యత్తు నిర్మించుకోవచ్చని, చిన్న వయసులోనే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోవాలన్నారు. ఆడపిల్లలు మగపిల్లల కంటే తక్కువ కాదని, భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని అన్నారు. చదువుకుంటే డాక్టర్లు,కలెక్టర్లుగా, తయారు కావచ్చని, మనసులో ఏది బలంగా అనుకుంటే, ఆ విధంగా తయారు కావచ్చని కలెక్టర్ అన్నారు.

విద్యార్థి దశలో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలన్న : కలెక్టర్
నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి) చదివే ధ్యేయంగా బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలని, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితేనే,బలమైన భవిష్యత్తు నిర్మించుకోవచ్చని, చిన్న వయసులోనే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోవాలన్నారు. ఆడపిల్లలు మగపిల్లల కంటే తక్కువ కాదని, భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని అన్నారు. చదువుకుంటే డాక్టర్లు,కలెక్టర్లుగా, తయారు కావచ్చని, మనసులో ఏది బలంగా అనుకుంటే, ఆ విధంగా తయారు కావచ్చని కలెక్టర్ అన్నారు.

