విద్యను,వైద్యాన్ని వ్యాపారం చేయొద్దు..*
*సామాన్య ప్రజలకు ఉచిత వైద్యాన్ని దూరం చేయొద్దు..*
*వై.యస్.ఆర్.సి.పి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు..*
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- *
విశాఖపట్నం జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో *విశాఖపట్నం వై.యస్.ఆర్ పార్కు ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద – కోటి సంతకాల సేకరణ కార్యక్రమం* జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కెకె రాజు మాట్లాడుతూ..
ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ దొంగ దెబ్బ కొట్టే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసే విధంగా ప్రజాభిప్రాయం లేకుండా ఒక కుట్రపూరిత నిర్ణయము ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది ..
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ కూటం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా శాంతియుత కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు ఈ ఉద్యమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోటిసంతకాల సేకరణ కార్యక్రమం మహా ఉదృతంగా జరుగుతుంది అని అన్నారు.. ఈ కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి విద్యను ,వైద్యన్ని ,వ్యాపారం చేయొద్దని సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం దూరం చేసే విధంగా వ్యవహరించవద్దని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి , సమన్వయకర్తలు మోల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు తైనాల విజయకుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షుడు పేర్ల ఖాదర్ భాషా , పేర్ల విజయ్ చందర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉరుకుటి రామచంద్రరావు , యువజన విభాగం జోన్ అధ్యక్షులు అంబటి శైలేష్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్, యువజన విభాగం అధికారి మహమ్మద్ ఇమ్రాన్, అనుబంధ విభాగం అధ్యక్షులు పేడాడ రమణి కుమారి , ఏం సునీల్ , పీలా ప్రేమ్ కిరణ్. నీలి రవి, బొండా ఉమా మహేశ్వర్ , పార్టీ నాయకులు అల్లంపల్లి రాజాబాబు, పల్లా దుర్గ, శ్రీనివాస్ గౌడ్, మువ్వల సంతోష్, తుళ్ళి చంద్రశేఖర్, ఉమ్మడి కళ్యాణ్, జగదీశ్ రెడ్డి, భవాని శంకర్. మౌళి , బొట్టారాజు , గాలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు


