

విజ్ఞానదాయకం క్షేత్రపర్యటన
నరసన్నపేట, ఆగస్టు 23 :
విద్యార్థులకు విజ్ఞానవంతమైన ఆలోచనలకు పునాది క్షేత్రపర్యటన అని గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యన్నారాయణ అన్నారు.
కళాశాల భౌతికశాస్త్ర, ఎలక్ట్రానిక్స్ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షేత్రపర్యటనను ఆయన శుక్రవారం ప్రారంభించారు. జ్ఞానాన్ని పంచుకుంటే అది మరింతగా పెరుగుతుందని, ఇచ్చిపుచ్చుకోవడం విద్యార్థులకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఆంధ్ర విశ్వవిద్యాలయం విభాగాల ఆచార్యులతో ముఖాముఖీ కలసి శాస్త్రీయ జ్ఞానం పెంపొందించుకునే అవకాశాన్ని పొందబోతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డా. మార్థండ కృష్ణ, పి. రమణమూర్తి, ఎన్. హారేరామ్, కె. నందిని తదితరులు పాల్గొన్నారు.

