*విజేతలకు బహుమతుల ప్రధాన ఉత్సవం*
*పున్నమి ప్రతినిధి తేదీ 23/ 12/25 వనపర్తి జిల్లా*
*జాతీయ గణిత దినోత్సవ సందర్భంగా పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు క్విజ్ పోటీలు గణితం పై కిట్స్ వ్యాసరచన స్పీచ్ తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఇందులో గెలుపొందిన విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు ఉపాధ్యాయ బృందం విజేతలకు బహుమతులను అందించడం జరిగింది పిల్లల్లో గణితం పట్ల ఆసక్తిని జిజ్ఞాసను పెంచేందుకు గణిత ఉపాధ్యాయులు కృషి చేయాలని ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు కోరారు గణితం అంటేనే జీవితం జీవితం అంటేనే గణితం నిజ జీవితంలో కూడా గణితం అంతర్లీనమై ఉన్నదని ఉపాధ్యాయ బృందం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు శ్రీనివాస రామానుజన్ గారి సేవలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని గడించాయని వారు మాట్లాడారు, ఈ కార్యక్రమంలో విద్యాభిమాని చాంద్ పాషా గారు హాజరయ్యారు*


