నెల్లూరు నగరంలో రద్దీ తగ్గించేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్ల కారణంగా ట్రాఫిక్ మరింతగా పెరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజయ మహల్ సెంటర్ పరిసరాల్లో బారికేడ్లు ఉండడం వల్ల రోడ్లు సన్నగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా ప్రధాన మార్గమైన పలు హాస్పిటల్స్ కి పోవలసిన ప్రధాన మార్గం ఇదే అవడం వల్ల అత్యవసర వాహనాలు కూడా (అంబులెన్స్, ఫైర్ సర్వీస్) బారికేడ్ల కారణంగా ఆలస్యమవుతున్నాయి. పాదచారులు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు.
మూవబుల్ బారికేడ్లు వాడితే ట్రాఫిక్ ఎక్కువైన సమయంలో వాటిని తొలగించి వాహనాల రాకపోక సులభం చేయవచ్చని సూచిస్తున్నారు.ప్రజలు సూచించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, ట్రాఫిక్ శాఖ సమగ్ర సమీక్ష జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రద్దీ తగ్గించడమే కాకుండా, అత్యవసర సేవలకు ఆటంకం రాకుండా చర్యలు చేపట్టాలని నెల్లూరు పౌరులు కోరుతున్నారు.

విజయ మహల్ సెంటర్ వద్ద బారికేడ్లతో ట్రాఫిక్ రద్దీపై ప్రజల ఆవేదన
నెల్లూరు నగరంలో రద్దీ తగ్గించేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్ల కారణంగా ట్రాఫిక్ మరింతగా పెరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజయ మహల్ సెంటర్ పరిసరాల్లో బారికేడ్లు ఉండడం వల్ల రోడ్లు సన్నగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా ప్రధాన మార్గమైన పలు హాస్పిటల్స్ కి పోవలసిన ప్రధాన మార్గం ఇదే అవడం వల్ల అత్యవసర వాహనాలు కూడా (అంబులెన్స్, ఫైర్ సర్వీస్) బారికేడ్ల కారణంగా ఆలస్యమవుతున్నాయి. పాదచారులు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు. మూవబుల్ బారికేడ్లు వాడితే ట్రాఫిక్ ఎక్కువైన సమయంలో వాటిని తొలగించి వాహనాల రాకపోక సులభం చేయవచ్చని సూచిస్తున్నారు.ప్రజలు సూచించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, ట్రాఫిక్ శాఖ సమగ్ర సమీక్ష జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రద్దీ తగ్గించడమే కాకుండా, అత్యవసర సేవలకు ఆటంకం రాకుండా చర్యలు చేపట్టాలని నెల్లూరు పౌరులు కోరుతున్నారు.

