అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బొలెరో ఒక్కసారిగా కుడివైపు టర్న్ చేయడంతో వెనకాలే వస్తున్న విజయ్ Lexus మోడల్ కారు దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు స్వల్పంగా దెబ్బతింది. దీంతో విజయ్ దేవరకొండ, అతడి స్నేహితులు వేరే వాహనంలో వెళ్లిపోయారు. పుట్టపర్తికి నిన్న వెళ్లి ఈరోజు హైదరాబాదుకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయ్ దేవరకొండ డ్రైవర్, అందె శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఉండవల్లి ఎస్సై శేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విజయ్ దేవరకొండ కారుకు తప్పిన ప్రమాదం.
అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బొలెరో ఒక్కసారిగా కుడివైపు టర్న్ చేయడంతో వెనకాలే వస్తున్న విజయ్ Lexus మోడల్ కారు దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు స్వల్పంగా దెబ్బతింది. దీంతో విజయ్ దేవరకొండ, అతడి స్నేహితులు వేరే వాహనంలో వెళ్లిపోయారు. పుట్టపర్తికి నిన్న వెళ్లి ఈరోజు హైదరాబాదుకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయ్ దేవరకొండ డ్రైవర్, అందె శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఉండవల్లి ఎస్సై శేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

