Tuesday, 9 December 2025
  • Home  
  • విజయ్ దివస్ సందర్భంగా అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం_ –కెసిఆర్ దీక్ష అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.. సబితా ఇంద్రారెడ్డి *
- రంగారెడ్డి

విజయ్ దివస్ సందర్భంగా అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం_ –కెసిఆర్ దీక్ష అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.. సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 09 : మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ – జిల్లెలగూడ ప్రాంతంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ దివస్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్కడినుంచి పాదయాత్రగా చందన చెరువు సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పాలాభిషేకం నిర్వహించి గులాబీ రంగు బెలూన్లను గాల్లోకి వదిలారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం కేసీఆర్ గారు చేపట్టిన 11 రోజుల దీక్ష ఫలితంగానే 2009 డిసెంబర్‌ 9న కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేశారు. ఆ చారిత్రాత్మక రోజును తెలంగాణ ప్రజలంతా విజయ దివస్‌గా జరుపుకుంటున్నారు అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన కేసీఆర్ త్యాగాన్ని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు అవమానించేలా వ్యాఖ్యలు చేయడం విచారకరం. నిజం తెలిసి మాట్లాడాలి. కేంద్ర హోం మంత్రి చిదంబరం కేసీఆర్ కి ప్రత్యక్షంగా ఫోన్ చేసి దీక్ష విరమించండి, తెలంగాణ రాష్ట్ర ప్రకటన విడుదల చేయబోతున్నాము అని చెప్పిన తర్వాతినే దీక్ష విరమించారు. అని స్పష్టం చేశారు.అలాగే, రాష్ట్రాన్ని అస్థిరపరిచే నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోంది అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 09 : మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ – జిల్లెలగూడ ప్రాంతంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ దివస్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్కడినుంచి పాదయాత్రగా చందన చెరువు సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పాలాభిషేకం నిర్వహించి గులాబీ రంగు బెలూన్లను గాల్లోకి వదిలారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం కేసీఆర్ గారు చేపట్టిన 11 రోజుల దీక్ష ఫలితంగానే 2009 డిసెంబర్‌ 9న కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేశారు. ఆ చారిత్రాత్మక రోజును తెలంగాణ ప్రజలంతా విజయ దివస్‌గా జరుపుకుంటున్నారు అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన కేసీఆర్ త్యాగాన్ని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు అవమానించేలా వ్యాఖ్యలు చేయడం విచారకరం. నిజం తెలిసి మాట్లాడాలి. కేంద్ర హోం మంత్రి చిదంబరం కేసీఆర్ కి ప్రత్యక్షంగా ఫోన్ చేసి దీక్ష విరమించండి, తెలంగాణ రాష్ట్ర ప్రకటన విడుదల చేయబోతున్నాము అని చెప్పిన తర్వాతినే దీక్ష విరమించారు. అని స్పష్టం చేశారు.అలాగే, రాష్ట్రాన్ని అస్థిరపరిచే నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోంది అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.