విజయశ్రీ బ్లడ్ సెంటర్ సీజ్, తదుపరి ఆదేశాల వరకు కార్యకలాపాలు నిలిపివేత.
*విశాఖ పట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
నగరంలోని మహారాణి పేట బుధవారపు గార్డెన్స్ లో విజయశ్రీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎం/ఎస్ విజయశ్రీ బ్లడ్ సెంటర్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసి బ్లడ్ బ్యాంక్ ను తాము సీజ్ చేసినట్టు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు తాము జరిపిన ఆకస్మిక తనిఖీలలో ఇక్కడ తీవ్రమైన నాణ్యతా ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయన్నారు. అర్హత లేని సిబ్బందితో పని చేయిస్తూ, సరైన వైద్య అధికారుల పర్యవేక్షణ లేకుండా రక్త సేకరణ చేస్తున్నారని, సరైన నాణ్యత ప్రమాణాలు కూడా పాటించడం లేదని తాము గమనించా మన్నారు. సంబంధిత అధికారుల నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ మరియు లైసెన్సింగ్ అథారిటీ ఎం.పాండురంగ ప్రసాద్ ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బ్లడ్ సెంటర్ యొక్క అన్ని కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసున్నా మన్నారు. రక్త సేకరణ లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే రక్త మార్పిడి సమయం లో రియాక్షన్స్ వచ్చి, ప్రాణాంతకం కావొచ్చన్నారు. అర్హత కలిగిన వైద్య అధికారులు మరియు సిబ్బంది సమక్షం లో మాత్రమే బ్లడ్ బ్యాంక్ కార్యకలాపాలు మరియు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని ఉల్లంఘించే లైసెన్సుదారులపై ఈ విధంగానే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

విజయశ్రీ బ్లడ్ సెంటర్ సీజ్, తదుపరి ఆదేశాల వరకు కార్యకలాపాలు నిలిపివేత.
విజయశ్రీ బ్లడ్ సెంటర్ సీజ్, తదుపరి ఆదేశాల వరకు కార్యకలాపాలు నిలిపివేత. *విశాఖ పట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * నగరంలోని మహారాణి పేట బుధవారపు గార్డెన్స్ లో విజయశ్రీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎం/ఎస్ విజయశ్రీ బ్లడ్ సెంటర్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసి బ్లడ్ బ్యాంక్ ను తాము సీజ్ చేసినట్టు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు తాము జరిపిన ఆకస్మిక తనిఖీలలో ఇక్కడ తీవ్రమైన నాణ్యతా ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయన్నారు. అర్హత లేని సిబ్బందితో పని చేయిస్తూ, సరైన వైద్య అధికారుల పర్యవేక్షణ లేకుండా రక్త సేకరణ చేస్తున్నారని, సరైన నాణ్యత ప్రమాణాలు కూడా పాటించడం లేదని తాము గమనించా మన్నారు. సంబంధిత అధికారుల నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ మరియు లైసెన్సింగ్ అథారిటీ ఎం.పాండురంగ ప్రసాద్ ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బ్లడ్ సెంటర్ యొక్క అన్ని కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసున్నా మన్నారు. రక్త సేకరణ లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే రక్త మార్పిడి సమయం లో రియాక్షన్స్ వచ్చి, ప్రాణాంతకం కావొచ్చన్నారు. అర్హత కలిగిన వైద్య అధికారులు మరియు సిబ్బంది సమక్షం లో మాత్రమే బ్లడ్ బ్యాంక్ కార్యకలాపాలు మరియు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని ఉల్లంఘించే లైసెన్సుదారులపై ఈ విధంగానే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

