సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు జాతీయస్థాయిలో ఈ పోటీలు జరగనున్నాయి … యోగాసనాలు శారీరిక – మానసిక ఆరోగ్యానికి పునాది… విజయవాడలో జాతీయస్థాయి పోటీలు జరగడం గర్వకారణం… యోగాసన క్రీడలను కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చాయి… యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సారథ్యంలో యోగాసన భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 1500 మంది పైగా క్రీడాకారులు హాజరవడం జరిగింది…
ఈ కార్యక్రమంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి రామకృష్ణ గారు, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఎ.రాధిక గారు, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ పి.ప్రేమకుమార్ గారు, యోగాసన భారత్ కోశాధికారి రచ్చిత్ కౌశిక్ గారు, కాంపీటీషన్ డైరెక్టర్ అభిజిత్ బోస్ జీ గారు, యోగాసన భారత్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ జయంతి గారు, జాయింట్ సెక్రటరీ వికాస్ గోస్వామి గారు, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డి.దుర్గారావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు…


