Sunday, 14 December 2025
  • Home  
  • విజయవంతం రెయిన్బో వీక్ వేడుకలు..2025… శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల. విజయవాడ.
- E-పేపర్

విజయవంతం రెయిన్బో వీక్ వేడుకలు..2025… శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల. విజయవాడ.

రెయిన్‌బో వీక్ వేడుకలు–2025 విజయవంతంగా నిర్వహణ.. ( పున్నమి విజయవాడ డాక్టర్ మంజుల గుదిమెళ్ళ.) విజయవాడలోని శ్రీ దుర్గ మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెయిన్‌బో వీక్ వేడుకలు–2025లో భాగంగా 13 డిసెంబర్ 2025న నేషనల్ సెమినార్“మోటివేషనల్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్” అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీనివాస రెడ్డి తాళ్లూరి, మేనేజింగ్ డైరెక్టర్, తాళ్లూరి ఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెయిన్‌బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్ హాజరై విద్యార్థినులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. విద్యార్థులు లక్ష్యసాధనలో పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని, పరిశ్రమలలో అవకాశాలను కూడా ఆయన వివరించారు. ఈ సందర్భంగా వారం రోజులపాటు 8 డిసెంబర్ నుండి 13 డిసెంబర్ వరకు విద్యార్దునులకు అనేక రకాల వినూత్న కాంపిటీషన్లు నిర్వహించబడాయి.పోస్టర్ ప్రెజెంటేషన్, కెమిస్ట్రీ గ్రూప్ క్విజ్, మ్యాజిక్ ఆఫ్ కెమిస్ట్రీ, థంషల్ ఆర్ట్స్, డాన్సింగ్ ఎలిమెంట్స్, కెమికల్ తాంబూలా వంటి సృజనాత్మక మరియు విజ్ఞానాత్మక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థునుల సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీనివాస రెడ్డి తాళ్లూరి, మేనేజింగ్ డైరెక్టర్, తాళ్లూరి ఫార్మా లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెయిన్‌బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్, హైదరాబాద్ పాల్గొన్నారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు, రసాయన శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి ఎం. సుభాషిని, రసాయన శాస్త్ర అధ్యాపకులు మరియు కళాశాల విద్యార్థునులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

రెయిన్‌బో వీక్ వేడుకలు–2025 విజయవంతంగా నిర్వహణ.. ( పున్నమి విజయవాడ
డాక్టర్ మంజుల గుదిమెళ్ళ.)

విజయవాడలోని శ్రీ దుర్గ మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెయిన్‌బో వీక్ వేడుకలు–2025లో భాగంగా 13 డిసెంబర్ 2025న నేషనల్ సెమినార్“మోటివేషనల్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్” అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీనివాస రెడ్డి తాళ్లూరి, మేనేజింగ్ డైరెక్టర్, తాళ్లూరి ఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెయిన్‌బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్ హాజరై విద్యార్థినులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. విద్యార్థులు లక్ష్యసాధనలో పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని, పరిశ్రమలలో అవకాశాలను కూడా ఆయన వివరించారు. ఈ సందర్భంగా వారం రోజులపాటు 8 డిసెంబర్ నుండి 13 డిసెంబర్ వరకు విద్యార్దునులకు అనేక రకాల వినూత్న కాంపిటీషన్లు నిర్వహించబడాయి.పోస్టర్ ప్రెజెంటేషన్, కెమిస్ట్రీ గ్రూప్ క్విజ్, మ్యాజిక్ ఆఫ్ కెమిస్ట్రీ, థంషల్ ఆర్ట్స్, డాన్సింగ్ ఎలిమెంట్స్, కెమికల్ తాంబూలా వంటి సృజనాత్మక మరియు విజ్ఞానాత్మక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు.

కార్యక్రమం అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థునుల సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీనివాస రెడ్డి తాళ్లూరి, మేనేజింగ్ డైరెక్టర్, తాళ్లూరి ఫార్మా లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెయిన్‌బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్, హైదరాబాద్ పాల్గొన్నారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి. సుబ్రహ్మణ్య కుమార్ గారు, రసాయన శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి ఎం. సుభాషిని, రసాయన శాస్త్ర అధ్యాపకులు మరియు కళాశాల విద్యార్థునులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.