విజయవంతంగా పింఛన్ల పంపిణీ: అత్తిపాటి శివకుమార్

0
31

విజయవంతంగా పింఛన్ల పంపిణీ

పున్నమి న్యూస్ – కోవూరు నియోజకవర్గం

జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మే 31వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముందుగానే నిర్వహించారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, 5వ వార్డు ఇన్‌చార్జి శ్రీ అత్తిపాటి శివకుమార్ నేతృత్వంలో ఉదయం పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

స్థానిక వృద్ధులు, నిరుపేదలు, దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమకు రావలసిన పింఛన్‌ను సకాలంలో పొందినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి అవ్యవస్థలకీ తావులేకుండా సజావుగా పింఛన్ల పంపిణీ జరగడం పట్ల స్థానికులు అధికారులపై హర్షం వ్యక్తం చేశారు.

0
0