*
సూర్యాపేట, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
విజయదశమి సందర్భంగా సూర్యాపేటలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుడు ముప్పారపు నరేందర్ గారి నేతృత్వంలో “ప్లాస్టిక్ భూత సంహారం” చేపట్టారు. 15 అడుగుల ఎత్తైన ప్లాస్టిక్ భూతాన్ని దహనం చేసి, ప్లాస్టిక్ ముప్పు గురించి అవగాహన కలిపించారు. ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను మానేందుకు ప్రతిజ్ఞ చేశారు. చెత్త సేకరణకు 3 గంటలు, నిర్మాణానికి 18 గంటలు పట్టింది. ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘం, గ్రీన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించాయి. చేతి సంచి వాడకాన్ని ప్రోత్సహిస్తూ ఈ వినూత్న కార్యాచరణ ప్రశంసలు అందుకుంది.


