
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలో సిద్ధాశ్రమం నుండి దొంగిలించిన పంచలోహ విగ్రహాలు మరియు ఇతర వస్తువులు కేసులో నరసన్నపేట పోలీసులు కీలకమైన పురోగతి సాధించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు నరసన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దొంగతనం కేసును ఎస్సై గారు మరియు సిబ్బంది వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.
తే18.10.2025దిన నరసన్నపేట గ్రామంలోని ఇందిరానగర్ కాలనీ లో గల సిద్ధాశ్రమం నుండి పంచలోహ విగ్రహాలు మరియు ఇతర ఆస్తులు దొంగతనం అయిన కేసులో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, తేదీ 24.10.2025 ఉదయం నరసన్నపేట ఎస్సై గారు తమ సిబ్బందితో కలిసి తామరపల్లి గ్రామదరి వద్ద రహదారి పై వాహన తనిఖీలు చేస్తుండగా, ఒక వ్యక్తి గోనెసంచి మోసుకుంటూ అనుమానాస్పదంగా ప్రవర్తించడం తో పట్టుకొని విచారణ జరిపారు. పరిశీలనలో ఆ వ్యక్తి పేరు దుంపల సింహాచలం (24 సంవత్సరాలు), హడ్కో కాలనీ, నరసన్నపేట అని తేలింది. విచారణలో అతడు సిద్ధాశ్రమం లోజరిగిన పంచలోహ విగ్రహాల దొంగతనానికి తానే కారణమని ఒప్పుకున్నాడు.
అదేవిధంగా, నిందితుడు గతంలో కూడా పలు నేరాలలో పాల్గొన్నట్లు దర్యాప్తులో బయటపడింది 2020లో ఒక మైనర్ బాలికపై వేధింపుల కేసు 2021లో ఇంటి దొంగతనం కేసు, ఆ సమయంలో మైనర్ కావడంతో జువైనల్ హెూమ్ కి తరలించినట్లు 2025 సెప్టెంబర్ లో మోటార్ సైకిల్ దొంగతనంకేసు కూడా నమోదు అయ్యింది. దర్యాప్తులో దుంపల సింహాచలం చిన్న వయసు నుంచే చెడు వ్యసనాలకు బానిసై, దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది.
పోలీసులు నిందితుడి వద్ద నుండి దొంగిలించిన పంచలోహ విగ్రహాలు మరియు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నరసన్నపేట పోలీసు వారు కొనసాగిస్తున్నారు.

