నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మెరైన్ బయాలజీ విభాగము, యోగివేమన యూనివర్సిటీ మైక్రో బయాలజీ విభాగము మరియు aieonki publishco హైదరాబాద్ సంయుక్తంగా “పర్యావరణ కాలుష్యం, పోషణ మరియు ప్రజారోగ్యంపై అంతర్జాతీయ సదస్సు (ICENPH-2025)” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై దీపప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కే. సునీత విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ప్రొ శంకర్ జి. అగర్వాల్, డాక్టర్ చల్ల సురేష్, ప్రొ పి. చంద్రమౌళి విచేసి జోతిప్రజులన చేసి కార్యక్రమాని ప్రారంభించారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ “ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, అలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి శాస్త్రీయ పరిశోధనలు మరియు అంతర్జాతీయ సహకారం అత్యంత అవసరం” అని అన్నారు. ఈ సదస్సు ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు కలిసి అనుభవాలను పంచుకోవడం ద్వారా కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుందని ఆయన పేర్కొన్నారు. తరువాత రిజిస్ట్రార్ డాక్టర్ కే. సునీత మాట్లాడుతూ, పోషకాహారం లోపం మరియు పర్యావరణ కాలుష్యం రెండూ కలిసి ప్రజారోగ్య సమస్యలను పెంచుతున్నాయని, వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ-విశ్వవిద్యాలయాలు-ప్రైవేట్ సంస్థలు కలసి ముందుకు రావాలని సూచించారు. National Physical Laboratory, New Delhi, India ప్రొఫెసర్ శంకర్ జి. అగర్వాల్, Scientist-G, HoD – Cell Biology, NIN, Hyderabad, India డాక్టర్ చల్ల సురేష్, Charman, Aieonki Publishco, Hyderabad ప్రొఫెసర్ పి. చంద్రమౌళి వంటి గౌరవ అతిథులు కూడా ఈ సందర్భంలో ప్రసంగించారు. వారు పర్యావరణ పరిరక్షణలో యువత పాత్రను, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాధాన్యతను వివరించారు. సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొని పత్రాలు సమర్పించారు. పర్యావరణ శాస్త్రం, మెరైన్ బయాలజీ, పోషణ శాస్త్రం, ప్రజారోగ్య రంగాలలో జరుగుతున్న తాజా పరిశోధనలపై చర్చలు జరిగాయి. ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ మాట్లాడుతూ “విద్యార్థులు ఇలాంటి అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడం ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధనల గురించి అవగాహన పెంపొందించుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ, సమతుల ఆహారం, ప్రజారోగ్యం వంటి అంశాలు కేవలం పాఠ్యాంశాల్లోనే కాకుండా జీవితంలోనూ పాటించాల్సిన ముఖ్యమైన విలువలు. విశ్వవిద్యాలయం తరఫున విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు కల్పించడం ఎంతో గర్వకారణం” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు “పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, పోషకాహారాన్ని పెంపొందించడం, ప్రజారోగ్యాన్ని కాపాడుకోవడం” అనే అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సదస్సు విజయవంతం కావడానికి కృషి చేసిన మెరైన్ బయాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎం హనుమారెడ్డి, డాక్టర్ సిహెచ్. వెంకట్రాయిలు, ప్రొ ఎల్. వీరాంజనేయరెడ్డి మరియు ప్రొ కె.మల్లికార్జున ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా నిర్వాహక కమిటీ సభ్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు విజయవంతం చేశారు.

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ సదస్సు…