Friday, 27 March 2026
  • Home  
  • వికలాంగుల హక్కుల చట్టం తెలుగు ప్ర‌తిని ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్*
- విశాఖపట్నం

వికలాంగుల హక్కుల చట్టం తెలుగు ప్ర‌తిని ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్*

*వికలాంగుల హక్కుల చట్టం తెలుగు ప్ర‌తిని ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్* *విశాఖ‌ప‌ట్ట‌ణం పున్నమి ప్రతినిధి:- * విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమం, సౌక‌ర్యార్థం తెలుగులో రూపొందించిన విక‌లాంగుల‌ హ‌క్కుల చ‌ట్టం-2016, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నియ‌మావ‌ళి -2023 ప్ర‌తుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ ఆవిష్క‌రించారు. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో వారి హక్కుల‌ను కాపాడే విధంగా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, చ‌ట్టాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేయాలని ఈ సంద‌ర్బంగా అధికారుల‌కు సూచించారు. అనంత‌రం సంబంధిత ప్ర‌తుల‌ను జిల్లా అధికారుల‌కు అంద‌జేశారు. విభిన్న ప్ర‌తిభావంతుల శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 03వ తేదీన వీఎంఆర్డీఏ చిల్డ్ర‌న్ ఎరీనాలో జ‌రిగే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించాలని ఈ సంద‌ర్భంగా సంబంధిత అధికారుల‌కు చెప్పారు. వికలాంగుల హ‌క్కుల చ‌ట్టం తెలుగు ప్రతుల ఆవిష్క‌ర‌ణ‌లో ఆ శాఖ ఏడీ కె. క‌విత‌, ఇన్ఛార్జి డీఆర్వో స‌త్తిబాబు, విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులు, ఇత‌ర విభాగాల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

*వికలాంగుల హక్కుల చట్టం తెలుగు ప్ర‌తిని ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్*

*విశాఖ‌ప‌ట్ట‌ణం పున్నమి ప్రతినిధి:- * విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమం, సౌక‌ర్యార్థం తెలుగులో రూపొందించిన విక‌లాంగుల‌ హ‌క్కుల చ‌ట్టం-2016, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నియ‌మావ‌ళి -2023 ప్ర‌తుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ ఆవిష్క‌రించారు. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో వారి హక్కుల‌ను కాపాడే విధంగా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, చ‌ట్టాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేయాలని ఈ సంద‌ర్బంగా అధికారుల‌కు సూచించారు. అనంత‌రం సంబంధిత ప్ర‌తుల‌ను జిల్లా అధికారుల‌కు అంద‌జేశారు. విభిన్న ప్ర‌తిభావంతుల శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 03వ తేదీన వీఎంఆర్డీఏ చిల్డ్ర‌న్ ఎరీనాలో జ‌రిగే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించాలని ఈ సంద‌ర్భంగా సంబంధిత అధికారుల‌కు చెప్పారు. వికలాంగుల హ‌క్కుల చ‌ట్టం తెలుగు ప్రతుల ఆవిష్క‌ర‌ణ‌లో ఆ శాఖ ఏడీ కె. క‌విత‌, ఇన్ఛార్జి డీఆర్వో స‌త్తిబాబు, విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులు, ఇత‌ర విభాగాల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.