అనంతపురం, ఆగస్టు 16 పున్నమి ప్రతినిధి
వికలాంగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతూ, తక్షణమే తమ వైఖరిని మార్చుకోవాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీర నాగరాజు డిమాండ్ చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ –
ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వికలాంగులకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని విస్మరించి సర్వేల పేరుతో వేలాదిమంది వికలాంగులను జాబితా నుండి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
“రాష్ట్ర బడ్జెట్‌లో మిగులు చూపించాలనే ఉద్దేశంతో వికలాంగులపై ఉక్కుపాదం మోపడం మానవత్వానికి విరుద్ధం” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం జైభీమ్ పార్టీ తక్షణ చర్యలు చేపడుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులను ఏకతాటిపైకి తెచ్చి పార్టీ అధినేతతో చర్చించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.


