రౌతులపూడి (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 21:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కన్వీనర్ ముద్రగడ గిరిబాబు హాజరయ్యారు. ముందుగా స్థానిక మార్క సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం, వృద్ధులకు ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి జమీల్ మాట్లాడుతూ పేదల పక్షపాతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తండ్రి ఆశయాలను పునుకు పుచ్చుకొని ఆయన ఆశయ సాధనకై నిరంతరం పనిచేస్తున్నారని జమీలు అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతకాయల వీర వెంకట సత్యనారాయణ, జడ్పిటిసి గొళ్ళు చిన్న దివానం, రౌతులపూడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర బాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, ఎస్ అగ్రహారం సర్పంచ్ సర్నం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కేదార్ శెట్టి నాగేశ్వరరావు, మరియు రౌతులపూడి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


