వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ మొదటి కార్యవర్గ సమావేశం
రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు ఆర్యవైశ్య సమాజములో వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ మొట్ట మొదటి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడమైనది.
ఈ సమావేశము నందు ముఖ్యముగా చర్చించదగిన విషయములు & చేస్తున్న కార్యక్రమాల వివరములు
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు 98% మార్కులు సాధించిన విద్యార్థికి ప్రతిభా అవార్డు క్రింద ఇచ్చిన 10,000/- రూ స్కాలర్షిప్ చెక్కును గాజులపల్లి హరి కుందన కు అందజేయడం జరిగినది.వాసవి కుటుంబ సురక్ష పథకం గురించి కూడా తెలియజేయడం జరిగినది. ముఖ్యముగా వాసవి కుటుంబ సభ్యులకు ఏదైనా సందేహాలు కానీ లేదా క్లబ్ ఇంకా గొప్ప స్థాయికి వెళ్లటానికి, అభ్యున్నతికి సభ్యుల యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది. కావున మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వాసవి మరియు వనిత క్లబ్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.


