వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు మేడా
అన్నమయ్య జిల్లా, అక్టోబర్1( పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని బుధవారం రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధి పరిశీలకులు ఎం.పీ మేడా రఘునాథ రెడ్డి మరియు నందలూరు ఎం.పీ.పీ మేడా విజయ భాస్కర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని ఆలయ నిర్వహకులు స్వాగతం పలికారు. అనంతరం చండీ హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆ వాసవి మాత ఆశీస్సులతో ఆనందంగా జీవించాలని మనస్పూర్తిగా ఆయన కోరు కున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు యంబలూరు నరసింహ స్వామి, ఉపాధ్యక్షులు మాకం వెంకట కుమార్, చలపాటి నరసింహ శ్రేష్టి, సెక్రెటరీ గెలివి నాగ సురేంద్ర కుమార్, యంబలూరు నరసింహ ప్రసాద్, వల్లంకొండు చంద్రశేఖర్, పరిటాల ప్రసాద్, ఎంబలూరు ప్రదీప్, మహిళా మండలి అధ్యక్షురాలు పల్లె మాధవి, సోమిశెట్టి ప్రభాకర్, పల్లె గ్రీష్మంత్ రెడ్డి, కరిముల్లా ఖాన్, ముమ్మడిశెట్టి సుధాకర్, కాకి చంద్ర, పాలగిరి సుధాకర్ రెడ్డి, మోదుగుల చంద్రశేఖర్, రాజశేఖర్ రెడ్డి, శ్రీవాణి, లక్ష్మీదేవి ముఖ్య నాయకులు తదితరులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.


