
విశాఖపట్నం, అక్టోబర్ 3:
51వ వార్డ్ మాధవధార వుడా కాలనీ విజేత పక్కన నిర్మితమైన వారాహి ఫంక్షన్ హాల్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ హాజరయ్యారు.
అనంతరం అశోక్ కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణని సన్మానించి, సాలువ కప్పి బొకే అందజేశారు. ప్రాంత ప్రజలు ఫంక్షన్ హాల్ ప్రారంభాన్ని ఆనందంగా స్వాగతించారు.

